Begin typing your search above and press return to search.

తమన్నా 'ఆహా' ప్రాజెక్ట్‌ అధికారిక ప్రకటన

By:  Tupaki Desk   |   9 Nov 2020 6:00 PM IST
తమన్నా ఆహా ప్రాజెక్ట్‌ అధికారిక ప్రకటన
X
మిల్కీ బ్యూటీ తమన్నా ఆహా కోసం ఒక ప్రాజెక్ట్ చేస్తుందంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. అయితే మొదట ఆ ప్రాజెక్ట్‌ ఒక టాక్‌ షో అంటూ ప్రచారం జరిగింది. కాని ఇటీవలే సమంత టాక్‌ షో ను ఆహా వారు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఆహా వారు తమన్నా ప్రాజెక్ట్‌ ను అధికారికంగా అనౌన్స్‌ చేశారు. 11th అవర్‌ అనే టైటిల్‌ తో ఈ వెబ్‌ సిరీస్‌ ను విలక్షణ దర్శకుడిగా గుర్తింపు ఉన్న ప్రవీణ్‌ సత్తార్‌ రూపొందించాడు. ఆహా మోస్ట్‌ బ్యూటీఫుల్‌ గా కనిపిస్తున్న పోస్టర్ తో వెబ్‌ సిరీస్‌ ను అధికారికంగా ఆహా వారు ప్రకటించారు.

హీరోయిన్‌ గా ఎన్నో సినమాల్లో నటంచి సూపర్‌ హిట్స్‌ ను అందుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా మొదటి సారి ఓటీటీ కోసం నటించింది. ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని భాషల్లో కూడా వెబ్‌ కంటెంట్‌ కు మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఆహాలో ఈ వెబ్‌ సిరీస్‌ అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. అల్లు అరవింద్‌ కంటెంట్‌ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వెబ్‌ సిరీస్ మరియు సినిమాలను కొనుగోలు చేస్తున్నారు.

ప్రవీణ్‌ సత్తార్‌ పై నమ్మకంతో తమన్నాకు ఉన్న క్రేజ్‌ కారణంగా ఈ వెబ్‌ సిరీస్‌ ను అల్లు అరవింద్‌ తీసుకున్నట్లుగా మీడియా సర్కిల్స్‌ లో ప్రచారం జరుగుతోంది. ఈమద్య కాలంలో ఆహా నుండి పలు ప్రకటనలు వచ్చాయి. మిల్కీ బ్యూటీ 11th అవర్‌ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.