Begin typing your search above and press return to search.

ఆ ఒక్క సినిమాతో నా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడింది

By:  Tupaki Desk   |   21 May 2022 1:30 AM GMT
ఆ ఒక్క సినిమాతో నా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడింది
X
సాధారణంగా నటులను వారు నటించిన సినిమాలో నచ్చిన మూవీ పేరడిగితే చెప్పడానికి కాసేపు ఆలోచిస్తారు. కానీ నచ్చని సినిమా గురించి అడిగితే మాత్రం చెప్పడానికి సంకోచిస్తారేమో గానీ.. వారి మనసులోకి మాత్రం టక్కున ఆ ఫిల్మ్ ప్లాష్ అయిపోతుంది.

యాక్టర్స్‌కి వారు చేసిన సినిమాల్లో నచ్చనవి ఉంటాయి. డైరెక్టర్‌ కోసమో.. నిర్మాత కోసమో.. పెద్ద హీరో అనో.. మంచి బ్యానర్‌ అనో.. ఇలా కారణాలేవైనా కొన్నిసార్లు కొన్ని సినిమాలు చేయాల్సి వస్తుంది. అలా ఆ సినిమా చేసిన తర్వాత మాత్రం ఎందుకీ మూవీలో నటించామా అనిపిస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా ఇప్పుడు అదే అనిపిస్తోంది. ఇంతకీ తాను నటించిన సినిమాల్లో తమన్నాకు నచ్చని మూవీ ఏంటి?

తమన్నా భాటియా.. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ. ఆమె స్టెప్పు వేస్తే ఎవరైనా కళ్లప్పగించి చూడాల్సిందే. ఆమెతో డ్యాన్స్ చేయాలంటే ఎంత పెద్ద హీరో అయినా కాస్త తటపటాయించాల్సిందే. ఒకప్పుడు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన తార తమన్నా. ఒకే ఏడాదిలో ఐదారు సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. చిన్నా.. పెద్దా.. స్టార్‌.. అప్‌కమింగ్ హీరో.. అనే తేడా లేకుండా దాదాపు అందరు యాక్టర్లతో నటించింది.

సాధారణంగా సౌత్‌లో ఒక వెలుగు వెలిగిన తర్వాత హీరోయిన్ల ఫోకస్ బాలీవుడ్‌పై పడుతుంది. సహజంగానే తమన్నా ఉత్తరాది. ఇక టాలీవుడ్‌లో సత్తా చాటిన ఈ మిల్కీ బ్యూటీ తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని బాలీవుడ్‌ వైపు అడుగేసింది.

కానీ తొలి అడుగే తప్పటడుగైంది. దాంతో తన తొలి బాలీవుడ్ సినిమా ఫట్ అయింది. అక్కడితో తమన్నా బాలీవుడ్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడింది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అజయ్ దేవగణ్‌తో తీసిని హిమ్మత్‌వాలా.

హిమ్మత్‌వాలా సినిమా బాలీవుడ్‌లో అట్టర్ ప్లాఫ్‌ అయింది. ఆ తర్వాత తమన్నాకు ఒక్క హిందీ సినిమా ఆఫర్‌ కూడా రాలేదు. అందుకే ఆ ఒక్క సినిమా చేసి ఉండకపోతే బాలీవుడ్‌లో తన కెరీర్ మరోలా ఉండేదని ఈ మిల్కీ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. బాలీవుడ్‌లో తన సత్తా చాటకపోయినా.. ప్రతిష్ఠాత్మక కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనే బంపర్ ఆఫర్ దక్కించుకుంది ఈ మిల్కీ బ్యూటీ. కేన్స్ రెడ్ కార్పెట్‌పై హొయలొలుకుతూ తన సొగసుతో అతిథులంతా తనను దటీజ్ తమన్నా అనేలా చేస్తోంది.