Begin typing your search above and press return to search.

హైద్రాబాద్ చేరుకున్న మిల్కీ అభినేత్రి

By:  Tupaki Desk   |   24 April 2016 11:30 AM GMT
హైద్రాబాద్ చేరుకున్న మిల్కీ అభినేత్రి
X
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు తన కెరీర్ బెస్ట్ అనదగ్గ స్థాయిలో ఉంది. బాహుబలి - బెంగాల్ టైగర్ - ఊపిరి అంటూ వరుస హిట్ చిత్రాల కారణంగా.. అమ్మడిలో జోష్ ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం అభినేత్రి అనే పేరుతో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీలో టైటిల్ రోల్ చేస్తోంది తమన్నా.

అభినేత్రి తమన్నా కెరీర్ లోనే స్పెషల్ గా నిలిచిపోనుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కతుండగా,.. ప్రభుదేవా - సోనూసూద్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారర్ కామెడీ జోనర్ లో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు దర్శకుడు ఎ.ఎల్.విజయ్. తెలుగు వెర్షన్ కు కోన వెంకట్ మాటలు రాయడంతో పాటు, నిర్మాత కూడా.

ఇప్పటికే వైజాగ్ - చెన్నై - మహరాష్ట్రల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న అభినేత్రి.. ఇప్పుడు తరువాతి షెడ్యూల్ కోసం హైద్రాబాద్ చేరుకుంది. మొదటి సారిగా ఓ సినిమాను అన్నీ తానై, తన భుజాలపై మోయాల్సిన అవసరం తమన్నాకి వచ్చిందని అంటున్నారు. అభినేత్రిలో ఓ స్పెషల్ సాంగ్ కు ప్రభుదేవా పక్కన డ్యాన్స్ చేసేందుకు అమీజాక్సన్ ను అడుగుతున్నారు మేకర్స్. అలాగే విభిన్న భాషల్లో విభిన్న యాక్టర్స్ తో ఒకేసారి పిక్చరైజ్ చేస్తున్నారు కూడా.