Begin typing your search above and press return to search.

​బాలీవుడ్లో తమన్ దూకుడు

By:  Tupaki Desk   |   16 May 2017 4:46 AM GMT
​బాలీవుడ్లో తమన్ దూకుడు
X
మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగులో జనరంజక సంగీతాన్ని ఇస్తున్నాడు తమన్. కిక్ సినిమాతో మంచి కిక్ స్టార్ట్ కెరీర్ మొదలిపెట్టిన తమన్ దూకుడు - బాడీగార్డ్ - బిజినెస్ మన్ సినిమాలతో స్టార్ మ్యూజిక్ కొంపోజర్ లలో ఒకడుగా మారాడు. తెలుగులో దేవి శ్రీ ప్రసాద్ కి గట్టి పోటీగా నిలిచాడు. ప్రతీ సినిమాలో తనదైన మెలోడీ మాస్ బీట్ పాటలతో మ్యూజికల్ హిట్ కొడుతున్న తమన్ తన పాటలను తనే కాపీ చేస్తాడనే అపవాదును కూడా ఎదుర్కొంటున్నాడు.

కట్ చేస్తే.. ఇప్పుడు హింది సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నాడు తమన్. బాలీవుడ్ టాప్ యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి సినిమాకు సంగీతం ఇవ్వనున్నాడు. రోహిత్ గోల్మాల్ ఫ్రాంఛైజీ సినిమా హిందీలో బెస్ట్ కామిడీ సిరీస్ గా మంచి పేరుంది. ఈ సిరీస్ లో 4వ సినిమా అక్టోబర్లో దీవాలికి విడుదల చేయనున్నారు. సినిమా షూటింగ్ కూడా పూర్తికావస్తోంది. ఈ సినిమాలో స్టార్ హీరో అజయ్ దేవగన్ - పరిణీతి చోప్రా - ఆర్షద్ వర్సి - తబు - ప్రకాష్ రాజ్ - నీల్ నితిన్ ముకేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోల్మాల్ సినిమా సిరీస్లో ఇది నాల్గోవ సినిమా. ఈ సినిమా లో తబు పరిణీతి చోప్రా కొత్తగా చేరారు మిగతా నటులు గోల్మాల్ మొదటి భాగం నుండి ఉన్నారు.

రోహిత్ శెట్టి పై సౌత్ సినిమాల ప్రభావం ఎక్కువనే చెప్పాలి. అతని యాక్షన్ ఎక్కువ సౌత్ నుండి ప్రభావితమై తీసినట్టు ఉంటుంది. స్వతహాగా కామిడీ యాక్షన్ను ఇష్టపడే డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా యాక్షన్ కామిడీగా తెరకెక్కనుంది. మరి ఇటువంటి సాదావకాశం తమన్ ఎలా మలుచుకొంటాడో చూద్దాం. సౌత్ నుండి ఇప్పటికే ఏ ఆర్‌ రహమాన్ హరీష్ జయరాజ్ నేషనల్ లెవెల్ లో సత్తా చాటారు ఇప్పుడు తమన్ కు ఆ అవకాశం వచ్చింది రోహిత్ శెట్టి సినిమాతో మరి అతని బాణీలు బాలీవుడ్ కి అదరగొడతాయో బెదరగొడతాయో చూడాలి.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/