Begin typing your search above and press return to search.

డేట్స్ తానే ఇస్తానంటున్న భామ

By:  Tupaki Desk   |   5 Jun 2017 4:42 PM GMT
డేట్స్ తానే ఇస్తానంటున్న భామ
X
అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ అరంగేట్ర చిత్రం అఖిల్ తో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సాయేషా సైగల్. అయితే.. అఖిల్ మూవీ జనాలను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో.. ఇక్కడ అవకాశాలు రాలేదు. కానీ ఇప్పటికే అజయ్ దేవగన్ తో కలిసి శివాయ్ అంటూ సక్సెస్ కూడా టేస్ట్ చేసేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తమిళ్ లో బిజీగానే ఉంది.

జయం రవి హీరోగా రూపొందిన వనమగన్.. ఈ నెల 23న విడుదల కానుండగా.. తమిళ్ లో సాయేషాకు ఇదే మొదటి సినిమా. అయితే.. ఇప్పటికే ఈమె ట్యాలెంట్ గురించి అందరికీ తెలిసిపోవడంతో.. తమిళ ఆఫర్లు బోలెడన్ని వచ్చేస్తున్నాడు. ఈ భామకు ఉన్న డిమాండ్ ను బేస్ చేసుకుని.. సాయేషాకి మేనేజర్ పలువురు హంగామా చేస్తున్నారు. ఆమె డేట్స్ ఇప్పిస్తామని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ బ్యూటీ.. తన కాల్షీట్స్ కావాలంటే తననే అడగాలని చెబుతోంది. తనకు మేనేజర్ ఎవరూ లేరని తేల్చేసింది సాయేషా సైగల్.

తమిళ్.. తెలుగు సినిమాల కోసం అయితే తనను కానీ.. తన తల్లిని కానీ సంప్రదించమంటూ చెప్పుకొచ్చింది సాయేషా. ఏ ఇతర కార్యక్రమాల గురించి అయినా సరే.. తనే చూసుకుంటానని చెబుతోంది. తనకు మేనేజర్ ఎవరూ లేరంటూ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది శివాయ్ సుందరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/