Begin typing your search above and press return to search.

యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో టాలెంటెడ్ యువ హీరో..!

By:  Tupaki Desk   |   28 Dec 2020 5:20 PM IST
యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో టాలెంటెడ్ యువ హీరో..!
X
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలు పెట్టిన శ్రీ విష్ణు.. విభిన్నమైన సినిమాలలో విలక్షణమైన పాత్రల్లో సహజంగా నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా మారిన తర్వాత 'అప్పట్లో ఒకడుండేవాడు' 'మెంటల్ మదిలో' 'నీది నాదీ ఒకే కథ' 'బ్రోచేవారెవరురా' వంటి విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు శ్రీవిష్ణు. హీరోగా నిలదొక్కుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న 'రాజ రాజ చోర' సినిమాని చివరి దశకు తీసుకొచ్చిన శ్రీవిష్ణు.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న సినిమాని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలానే ఇటీవలే స్టార్ట్ చేసిన 'గాలి సంపత్' సినిమా షూటింగ్ 80శాతం కంప్లీట్ చేసాడు. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు శ్రీవిష్ణు.

లక్కీ మీడియా బ్యానర్ లో బెక్కం వేణుగోపాల్ నిర్మించనున్న ఓ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో శ్రీ విష్ణు నటించనున్నాడు. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ అల్లూరి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇందులో శ్రీ విష్ణు ఇంతకముందు నటించని డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ని 2021 ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చనుండగా.. శివేంద్ర సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఏదేమైనా 2019లో 'తిప్పారా మీసం' సినిమా ప్లాప్ తర్వాత మరో సినిమాని రిలీజ్ చేయని శ్రీ విష్ణు.. 2021లో నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ తో రాబోతున్నాడన్నమాట.