Begin typing your search above and press return to search.

ట్యాలెంటెడ్‌ హీరో పాన్ సౌత్‌ ఇండియా మూవీ

By:  Tupaki Desk   |   4 Dec 2022 12:30 AM GMT
ట్యాలెంటెడ్‌ హీరో పాన్ సౌత్‌ ఇండియా మూవీ
X
పెద్దగా బ్యాక్ గ్రౌండ్‌ లేకుండానే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నటుడు సత్యదేవ్‌. చాలా తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న సత్యదేవ్‌ కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ నుండి కూడా సత్యదేవ్‌ కు పిలుపు వచ్చింది అంటే ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలను స్పీడ్‌ స్పీడ్‌ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి నటుడిగా మంచి పేరును సొంతం చేసుకున్న సత్యదేవ్‌ హీరోగా కమర్షియల్‌ భారీ బ్లాక్‌ బస్టర్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. కరోనా సమయంలో అందరూ హీరోల కంటే అత్యధిక సినిమాలు చేసిన మరియు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన హీరోగా సత్యదేవ్‌ నిలుస్తాడు.

ప్రస్తుతం ఈయన నటిస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ఆ సినిమా విడుదల కాకుండానే మరో పాన్‌ సౌత్‌ ఇండియా మూవీని సత్యదేవ్‌ కమిట్‌ అయ్యాడు అంటూ సమాచారం అందుతోంది.

సత్యదేవ్‌ హీరోగా తెలుగు లో రూపొందబోతున్న సినిమాను తెలుగు తో పాటు ఇతర సౌత్‌ ఇండియన్ భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుంది. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో విభిన్నమైన కాన్సెప్ట్‌ తో సత్యదేవ్‌ తన తదుపరి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట.

నటుడిగా మరోసారి తనను తాను నిరూపించుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని.. యూనివర్శిల్‌ సబ్జెక్ట్‌ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాదిలోనే ఈ పాన్ సౌత్‌ ఇండియన్‌ మూవీ తో సత్యదేవ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.