Begin typing your search above and press return to search.
ట్యాలెంటెడ్ హీరో మరో మూవీ ఓటీటీలోనే..!
By: Tupaki Desk | 18 Jun 2020 11:00 PM ISTట్యాలెంటెడ్ హీరోగా గుర్తింపు దక్కించుకున్న సత్యదేవ్ నటించిన ‘ఉమామహేశ్వరరావు ఉగ్రరూపస్య’ చిత్రంను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు కనుక పలు చిత్రాలు కూడా ఓటీటీ దారి పడుతున్నాయి. ఇదే సమయంలో సత్యదేవ్ నటించిన ఉమామహేశ్వరరావు ఉగ్రరూపస్య చిత్రంతో పాటు మరో సినిమా కూడా ఓటీటీ లో విడుదల కాబోతుంది.
సత్యదేవ్ హీరోగా నటించిన 47 రోజులు అనే చిత్రం కూడా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతుంది. ఉమామహేశ్వరరావు ఉగ్రరూపస్య చిత్రంను నెట్ ప్లిక్స్ లో విడుదల చేయనుండగా 47 రోజులు సినిమాను జీ5 యాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈనెల 30వ తారీకున 47 చిత్రంను జీ 5 లో విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించాడు. విభిన్నమైన సినిమాలు చేస్తూ నటుడిగా మంచి పేరు దక్కించుకుంటున్న సత్యదేవ్ ఈ రెండు సినిమాలతో ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తాడనే నమ్మకంను ఆయా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.