Begin typing your search above and press return to search.

టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేనా..?

By:  Tupaki Desk   |   17 Dec 2020 1:24 PM IST
టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేనా..?
X
ఫస్ట్ సినిమా 'పెళ్లి చూపులు' తోనే ఇండస్ట్రీ.మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' అంటూ డిఫెరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేసి యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో 'మహానటి' 'ఫలక్‌ నుమా దాస్' సినిమాతో నటుడిగా మారి అందర్నీ షాక్ కి గురి చేసాడు. అంతేకాకుండా 'మీకు మాత్రమే చెప్తా' సినిమాతో హీరోగా మారాడు. ఇక 'నీకు మాత్రమే చెప్తా' అనే టాక్ షో తో హోస్ట్ అవతారమెత్తాడు తరుణ్. ఇటీవల 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమాలో కనిపించి అలరించాడు. ద‌ర్శ‌కుడిగా.. ర‌చ‌యిత‌గా.. నటుడిగా తన మల్టీ టాలెంట్స్ అన్నీ బయటకి తీస్తున్న తరుణ్ భాస్కర్.. తనకు నచ్చినప్పుడు మాత్రమే సినిమాలు చేస్తున్నట్లు అర్థం అవుతోంది.

తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా వచ్చి రెండేళ్లు అవుతోంది. ఏ క్లాస్ ఆడియన్స్ ని మెప్పించే రీతిన సినిమా తీయ‌గ‌లిగే స‌త్తా ఉండి కూడా తరుణ్ ఎందుక‌నో సైలెంట్ గా ఉంటున్నాడు. యువ దర్శకులు అందరూ ఒకటి రెండు సినిమాలను లైన్ లో పెట్టి బిజీగా మారుతుంటే.. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. రెగ్యులర్ గా సినిమాలు చేయకపోవడంతో పెద్ద పెద్ద బ్యానర్లు హీరోలు కూడా ఇప్పుడు తరుణ్ కి దూరంగా ఉంటున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. సురేష్ బాబు లాంటి ప్రొడ్యూసర్ తప్పితే మిగతా పెద్ద నిర్మాతలు ఎవరూ తరుణ్ భాస్కర్ ని ఎంకరేజ్ చేయడం లేదని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు. మరి తరుణ్ త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడేమో చూడాలి.