Begin typing your search above and press return to search.

ట్యాలెంటెడ్ బ్యూటీ 6 ఇయర్స్ జర్నీ సూపర్‌ హిట్‌

By:  Tupaki Desk   |   10 Jun 2022 8:30 AM GMT
ట్యాలెంటెడ్ బ్యూటీ 6 ఇయర్స్ జర్నీ సూపర్‌ హిట్‌
X
ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరోయిన్స్ ప్రతి సంవత్సరం అడుగు పెడుతూ ఉంటారు. వారిలో కొందరు మాత్రమే కెరీర్‌ లో ముందుకు సాగుతారు. కొందరు ఒకటి రెండు సంవత్సరాల్లోనే కనిపించకుండా పోతారు.

కొందరు మాత్రం దశాబ్దాల తరబడి హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలిచి పోతారు.. వయసు అయిపోయినా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమా ఇండస్ట్రీలోనే ఉంటారు. అలా నిలిచి పోయే హీరోయిన్ నివేథ పేతురాజ్‌ అనడంలో సందేహం లేదు.

హీరోయిన్ గా నివేథా పేతురాజ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆరు సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ ఆరు సంవత్సరాల్లో ఈ అమ్మడు ఎన్నో వైవిధ్యభరిత సినిమాలను చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగు లో కూడా పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు అక్కడ ఇక్కడ మంచి స్టార్‌ డమ్‌ ను దక్కించుకుని దూసుకు పోతుంది.

తమిళంలో ఈమె మొదటి సినిమా ఒరు నాల్‌ కూతు 2016 లో విడుదల అయ్యింది. మొదటి సినిమా తోనే నటిగా అక్కడి ప్రేక్షకులను అలరించడంతో పాటు మంచి అందంతో ఆకట్టుకుంది. స్కిన్ షో విషయంలో మొదట్లో ఆసక్తి చూపించని ఈ అమ్మడు ఈమద్య కాలంలో అందాల ఆరబోతను కూడా ఓ మోస్తరుగా చేస్తూ ఆకట్టుకుంటుంది.

తెలుగు లో 2017 సంవత్సరంలో మెంటల్ మదిలో సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా నుండి ఇప్పటి వరకు వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చింది. ఇటీవల విరాటపర్వం సినిమాలో కూడా నటించిన ఈ అమ్మడు మరిన్ని సినిమాల్లో నటించబోతుంది. ఆ సినిమాలకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడబోతుంది. ఈమె అల వైకుంఠపురంలో నటించి తెలుగు లో మరింతగా పాపులర్ అయ్యింది.

విరాటపర్వంతో తెలుగు లో స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారే అవకాశం ఉంది. సినిమాల్లోనే కాకుండా వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటిస్తు ఈ అమ్మడు అన్ని ప్లాట్‌ ఫామ్స్ పై ఆకట్టుకుంటూ ఉంది. తెలుగు లో ఈ అమ్మడికి మంచి భవిష్యత్తు ఉంది. ఆరు ఏళ్లు ఇండస్ట్రీలో సక్సెస్ లను దక్కించుకున్న ఈ అమ్మడు రాబోయే పదేళ్ల పాటు మరింతగా సక్సెస్ లు ఈమెకు దక్కుతాయని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.