Begin typing your search above and press return to search.
'మహానటి' మేకర్స్ తో టాలెంటెడ్ యాక్టర్ 'కంబాలపల్లి కథలు'...!
By: Tupaki Desk | 13 Sept 2020 4:20 PM ISTకమెడియన్ ప్రియదర్శి పులికొండ 'పెళ్లి చూపులు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం కామెడీకే పరిమితం కాకుండా ప్రియదర్శి కెరీర్ స్టార్టింగ్ నుంచి విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో 'అర్జున్ రెడ్డి' 'కణం' 'తొలిప్రేమ' 'అ!' 'గ్యాంగ్ లీడర్' 'వరల్డ్ ఫేమస్' 'బ్రోచేవారెవరురా' లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు దర్శి. స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తూ బిజీ యాక్టర్ గా మారిన ప్రియదర్శి హీరోగా మారి 'మల్లేశం' 'మిఠాయి' అనే చిత్రాల్లో నటించి నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. అంతేకాకుండా ఈ మధ్య వెబ్ వరల్డ్ లో కూడా అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. అక్కినేని నాగార్జున (అన్నపూర్ణ స్టూడియోస్) మరియు జీ 5 వారు కలిసి నిర్మించిన 'లూజర్' అనే వెబ్ సిరీస్ లో నటించాడు ప్రియదర్శి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో దర్శి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
ఈ నేపథ్యంలో ప్రియదర్శి మరో వెబ్ సిరీస్ తో రాబోతున్నాడు. 'మహానటి' చిత్రాన్ని నిర్మించిన స్వప్న దత్ ''కంబాలపల్లి కథలు'' అనే వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సిరీస్ కి ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ నేడు స్టార్ట్ అయినట్లు ప్రియదర్శి ట్విట్టర్ లో వెల్లడించారు. పల్లెటూరి నేపథ్యంలో రూపొందనున్న ఈ సిరీస్ లో దర్శి 'హైబత్' అనే క్యారక్టర్ పోషిస్తున్నాడు. ఇంతకముందు చాలా సినిమాల్లో తెలంగాణా మాండలీకంలో మాట్లాడిన దర్శి మరోసారి అదే యాసతో ప్రేక్షకులను అలరిస్తాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రియదర్శి ప్రస్తుతం 'జాతి రత్నాలు' మరియు ప్రభాస్ 'రాధే శ్యామ్' సినిమాలలో నటిస్తున్నాడు.