Begin typing your search above and press return to search.

టాలెంటెడ్ యాక్ట‌ర్ దుర్మ‌ర‌ణం!

By:  Tupaki Desk   |   23 April 2021 5:00 PM IST
టాలెంటెడ్ యాక్ట‌ర్ దుర్మ‌ర‌ణం!
X
బాలీవుడ్ టాలెంట్ యాక్ట‌ర్ అమిత్ ‌మిస్త్రీ మ‌ర‌ణించారు. ముంబై అంథేరీలోని త‌న నివాసంలో హ‌ఠాత్తుగా గుండెపోటు సంభ‌వించిన‌ట్టు స‌మాచారం. క్ష‌ణాల్లో కుప్ప‌కూలిన మిస్త్రీ.. వెంట‌నే ప్రాణాలు కోల్పోయిన‌ట్టుగా తెలుస్తోంది. దీంతో.. ఆయ‌న్ను ఆసుప‌త్రికి కూడా తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం రాలేద‌ట‌.

రంగ‌స్థ‌లం నుంచి ఎదిగిన మిస్త్రీ ఎన్నో వైవిధ్య‌మైన నాట‌కాలు వేశారు. ఆ త‌ర్వాత బుల్లితెర ప‌రిశ్ర‌మ‌లోకి ప్ర‌వేశించిన ఆయ‌న‌.. దాదాపు 10 సీరియ‌ల్స్ లో న‌టించారు. ఇందులో 'తెనాలి రామ‌' అనే సిరీస్ మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ త‌ర్వాత సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట‌రైన‌ మిస్త్రీ.. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా చిత్రాల్లో న‌టించారు. 'షోర్ ఇన్ ద సిటీ', 'గలీ గలీ చోర్ హై', 'ఎ జెంటిల్మేన్' వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. గతేడాది ఓటీటీలో విడుదలైన 'బాండిష్ బండిట్స్' లో ఆయన నటనకు అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం మిస్త్రీ న‌టించిన 'భూత్ పోలీస్' రిలీజ్ కు సిద్దంగా ఉంది.

అలాంటి మిస్త్రీ అర్ధంతరంగా కన్ను మూయడం అందరినీ కలచి వేస్తోంది. ప్రస్తుతం అమిత్ మిస్త్రీ వయసు 47 సంవత్సరాలు మాత్రమే. ఈ వయసులోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అమిత్ మృతిప‌ట్ల బాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.