Begin typing your search above and press return to search.
ఆ డైరెక్టర్ రూమ్ లోకి తీసుకెళ్లి బ్లూ ఫిల్మ్ చూపించాడు!!
By: Tupaki Desk | 13 Sept 2020 11:00 AM ISTబాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు ఎన్నో మలుపులు తిరిగి.. చివరికి సినీ ఇండస్ట్రీలోని డ్రగ్స్ వ్యవహారాన్ని బయటకు తీసింది. బాలీవుడ్ లో పేలిన డ్రగ్ బాంబ్ ప్రకంపనలు శాండిల్ వుడ్ - టాలీవుడ్ లకు కూడా పాకాయి. రియా చక్రవర్తి అరెస్టు తర్వాత చాలామంది సినీ ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా రియా వెల్లడించిన పేర్లలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ - సారా అలీఖాన్ పేర్లు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు శాండల్ వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో నటీమణులు రాగిణి ద్వివేది - సంజన గల్రానీ అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ పాయల్ ఘోష్ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది.
పాయల్ ఘోష్ మాట్లాడుతూ ''నేనెందుకు ట్రై చేయకూడదని డ్రగ్స్ తీసుకుంటున్నారు. డ్రగ్స్ తీసుకుంటే ఉత్సాహంగా ఉంటామని యాక్టర్స్ ఫీలింగ్. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఫ్యాన్స్ ను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. సుశాంత్ కొన్నేళ్లుగా నాకు తెలుసు. అతను సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదు. సుశాంత్ తో కలసి జిమ్ కి వెళ్లేదాన్ని. అతను సూసైడ్ చేసుకున్నాడంటే నమ్మకం కలగడం లేదు'' అని చెప్పుకొచ్చింది. ''నేను ఓ డైరెక్టర్ ని ఈఆర్డీ ప్రాంతంలో కలిసాను. నన్ను బాగా గారాబం చేసేవాడు. నన్ను రూమ్ లోకి తీసుకెళ్లి బ్లూ ఫిల్మ్ చూపించాడు. నేను ఏ హీరోయిన్ ని పిలిచినా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుందని చెప్పాడు. కానీ నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి తప్పించుకున్నా. ఇప్పటిదాకా మళ్ళీ అతడిని కలవలేదు. నాకు బాలీవుడ్ లో మరే డైరెక్టర్ తో ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు'' అని సంచలన విషయాలు వెల్లడించింది పాయల్.
ఇంకా పాయల్ మాట్లాడుతూ గతంలో ఓ క్రికెటర్ తో డేటింగ్ చేసి బ్రేకప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని.. ఒక దశలో చనిపోతానని అనుకున్న తాను ట్రీట్మెంట్ తర్వాత డిప్రెషన్ నుంచి బయటపడ్డానని చెప్పింది. ఇక డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ - సారా అలీఖాన్ పేర్లు తెరపైకి రావడంపై స్పందించిన పాయల్.. సారా చాలా మంచి అమ్మాయి అని తెలిపింది. ఆమె పార్టీలో పాల్గొని ఉండవచ్చు గానీ ఆ పార్టీలో ఏం జరిగిందనేది తనకు తెలియదని చెప్పింది. కొన్నిసార్లు చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి కూడా కొందరు స్టార్స్ డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారని.. కానీ వారంతా డ్రగ్స్ బానిసలు కాదని పాయల్ చెప్పుకొచ్చింది.