Begin typing your search above and press return to search.

నా బైక్ తీసుకొని బాధితులకు ఆక్సిజన్ అందించండి: యువహీరో

By:  Tupaki Desk   |   1 May 2021 1:30 PM GMT
నా బైక్ తీసుకొని బాధితులకు ఆక్సిజన్ అందించండి: యువహీరో
X
ప్రస్తుతం కరోనా కుదుపు వలన దేశవ్యాప్తంగా జనాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకి పరిస్థితులు సీరియస్ అవుతుండటంతో ప్రభుత్వాలు కూడా కంట్రోల్ చేయడానికి తెగకష్టపడుతున్నాయి. కానీ ఎవరి వలన కూడా ఈ కరోనా ఆపడం సాధ్యం కావడం లేదు. కానీ బాధితులకు సహాయం చేయడానికి మాత్రం సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ముంబై నగరంలో రోజురోజుకి మృతులసంఖ్య పెరుగుతూ ఉండటంతో బాలీవుడ్ సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, ప్రియాంకచోప్రా, సోనూసూద్ ఇలా చాలామంది తారలు కదిలి వస్తున్నారు. తాజాగా కరోనా బాధితులను ఆదుకునేందుకు మరో యంగ్ హీరో హర్షవర్ధన్ రాణే ముందుకు వచ్చాడు.

కరోనా బాధితులకు సహాయం చేసేందుకు ఈ హీరో తన ఫాన్సీ రాయల్ ఎంఫిల్డ్ బైకును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. కరోనా పేషెంట్స్ కు అవసరమయ్యే ఆక్సిజన్ అందించడానికి నా బైక్ తీసుకొని బాధితులకు సహాయం అందించగలరని కోరుతున్నట్లు తెలిపాడు. అలాగే 'ఈ బైక్ ద్వారా వచ్చిన ఆక్సిజన్ నిరుపేదలకు అందించబడతాయి. దయచేసి హైదరాబాద్ లో ఎవరైనా కాంట్రాక్టర్స్ ఉంటే సహకరించండి' అంటూ స్టేటస్ లో మెన్షన్ చేసాడు. అలాగే బైక్ ఫోటోను పోస్ట్ చేసాడు హర్షవర్ధన్ రాణే. ప్రస్తుతం హర్షవర్ధన్ స్టేటస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ఈ హీరో సహకరించడానికి ముందుకు వచ్చినందుకు నేటిజన్లు కూడా అభినందనలు తెలుపుతున్నారు.