Begin typing your search above and press return to search.

క్లోజ్ షాటా..లాంగ్ షాటా? డౌట్ అడిగినందుకు 30 చెంప‌దెబ్బ‌లు?

By:  Tupaki Desk   |   23 July 2019 10:40 AM IST
క్లోజ్ షాటా..లాంగ్ షాటా? డౌట్ అడిగినందుకు 30 చెంప‌దెబ్బ‌లు?
X
తాను న‌టిస్తున్న సినిమాలో ఒక సీన్ లో యాక్ట్ చేసే న‌టి.. తాను చేయ‌బోయే సీన్ క్లోజ్ షాటా? లాంగ్ షాటా? అన్న ప్ర‌శ్న వేయ‌టం త‌ప్పు అవుతుందా? అంటే.. పిచ్చోడిని చూసేలా చూసే వీలుంది. కానీ.. ఈ ఉదంతం గురించి తెలిస్తే.. షాక్ తిన‌ట‌మే కాదు.. సినిమా రంగంలో వేధింపులు ఈస్థాయిలో ఉంటాయా? అన్న ఒళ్లు జ‌ల‌ద‌రింపు క‌ల‌గ‌క‌మాన‌దు. సినిమా రంగంలో ఉండే లైంగిక వేధింపుల‌పై యుద్ధం చేస్తున్న మీటూ ఉద్య‌మం ఒక‌టైతే.. లెక్క‌లేన‌న్ని వేధింపులు ఉంటాయ‌న్న విష‌యాలు అప్పుడ‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి.

తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఒక ఉదంతం వింటే.. సినిమా రంగంలో వేధింపుల‌కు పీక్స్ గా ఈ ఉదంతాన్ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌ముఖ తైవాన్ న‌టి వూ కెసి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఆమె తాజాగా న‌టించిన చిత్రం నినా వూ. పేరు అర్థం కాన‌ట్లు ఉంటుంది. ఎందుకంటే అది తైవాన్ మూవీ. ఈ సినిమా స్పెష‌ల్ ఏమంటే.. స‌ద‌రు న‌టి స్వ‌యంగా రాసిన క‌థ‌. అంతేకాదు.. ఆమె న‌టించారు కూడా. సినిమా రంగంలో లైంగిక వేధింపుల నేప‌థ్యంలో ఈ సినిమాను తీశారు.

ఇటీవ‌ల కేన్స్ చిత్రోత్స‌వంలో ప్ర‌ద‌ర్శించిన ఈ చిత్రానికి పెద్ద ఎత్తున ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా త్వ‌ర‌లో తైవాల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా క‌థ ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాలో యాక్ట్ చేసిన న‌టి వూ కెసి.. త‌న జీవితంలో ఎదురైన వేధింపుల గురించి చెప్పిన వైనం షాక్ కు గురి చేయ‌క త‌ప్ప‌దు. చిన్న చిన్న విష‌యాల‌కు సైతం సినిమా రంగంలో ఎంత‌లా వేధింపుల‌కు గురి చేస్తార‌న్న విష‌యం ఆమె చెప్పిన మాట‌తో అర్థం కాక మాన‌దు.

తాను ఒక సినిమాను చేసే స‌మ‌యంలో తాను చేసే సీన్ లాంగ్ షాటా? క్లోజ్ షాటా? అని అడిగాన‌ని.. దానికి అనుగుణంగా తాను మ‌రింతగా ప్రిపేర్ కావ‌టం త‌ప్పించి ఇంకో ఆలోచ‌న లేద‌న్నారు. కానీ.. స‌ద‌రు ద‌ర్శ‌కుడి ఇగో హ‌ర్ట్ అయి.. త‌న‌ను ప్ర‌శ్నించ‌ట‌మా? అన్న భావ‌న‌తో సినిమాలో లేని చెంప‌దెబ్బ సీన్ ను షూట్ చేయించి.. త‌న చెంప‌పై కొట్టే స‌న్నివేశాల్ని తీశార‌న్నారు. స్క్రిప్ట్ లో లేకున్నా తీసిన చెంప‌దెబ్బ సీన్ స‌రిగా రాలేదంటూ ఏకంగా 30 సార్లు చిత్రీక‌రించార‌ని.. దీనికి ఎవ‌రూ అడ్డు చెప్ప‌లేద‌న్నారు. ఆ త‌ర్వాత స‌ద‌రు చిత్ర బృందం కూడా త‌న‌ను వేధించిన‌ట్లు చెప్పారు. చాలా చిన్నదిగా అనిపించే ప్ర‌శ్న వేసినందుకు ఇంత భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌న్న షాకింగ్ విష‌యాన్ని వెల్ల‌డించారు వూ కెసి. ఈమె సినిమా త‌ర్వాత‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రెంద‌రి ద‌ర్శ‌కుల దుర్మార్గాలు.. శాడిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయో చూడాలి.