Begin typing your search above and press return to search.

ఎన్నాళ్ళకి ఈ కలయిక!!

By:  Tupaki Desk   |   22 Aug 2017 11:21 PM IST
ఎన్నాళ్ళకి ఈ కలయిక!!
X
ఒకప్పుడు ఒకరి తర్వాత ఒకరు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఎదిగి ప్రస్తుతం కుటుంబంతో హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు కరిష్మా కపూర్ - కరీనా కపూర్. సినిమాల్లో ఉన్నపుడు ఎవరి స్థాయిలో వారు మెప్పించిన ఈ కపూర్ సిస్టర్స్ చాలా రోజుల తర్వాత ఒక్కటై సోషల్ మీడియాలో ఫొటోలతో హల్ చల్ చేస్తున్నారు.

రీసెంట్ గా ఓ షూటింగ్ స్పాట్ లో ఫోటోలను షేర్ చేసి చాలా రోజుల తర్వాత ఒక ఫ్రేమ్ లో కనిపించి అభిమానులను థ్రిల్ చేశారు. ఇక కరీనా తన కుమారుడు అయిన తైమూర్ ని ఎత్తుకోగా.. కరిష్మా తన ఇద్దరు పిల్లలతో అద్దంలోకి చూస్తూ.. తన మొబైల్ తో ఫోటో దింపింది. ఆ ఫోటోని కరిష్మా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.ఇక కరీనా -సైఫ్ అలీఖాన్ కుమారుడు చాలా క్యూట్ గా ఉన్నాడని రాబోయే యాక్షన్ హీరో అని కామెంట్ చేస్తున్నారు.

దాదాపు బాలీవుడ్ స్టార్స్ అందరితో కలిసి ఆడిపాడిన కరీనా సిస్టర్స్ ఇప్పుడు కూడా గ్లామర్ డ్రెస్ లతో ఆకర్షిస్తున్నారు. అంతే కాకుండా ఓ వీడియో ను కూడా పోస్ట్ చేసి ఆకట్టుకున్నారు. ఇక వీరిద్దరూ కలవడానికి అసలు కారణం సమ్ థింగ్ స్పెషల్ అంటున్నారు. త్వరలోనే సర్పరైజ్ ఇస్తారట. ఇక కరీనా తన ప్రెగ్నెన్సీ గ్యాప్ తర్వాత ఒక సినిమాకు రెడీ అవుతోంది. వీరే ది వెడ్డింగ్ అనే సినిమాలో సోనమ్ కపూర్ తో స్క్రిన్ షేర్ చేసుకోనుంది.