Begin typing your search above and press return to search.

రెండేళ్ళ స్టార్ కిడ్ డెబ్యూ ఫిక్స్!

By:  Tupaki Desk   |   2 April 2019 9:15 AM GMT
రెండేళ్ళ స్టార్ కిడ్ డెబ్యూ ఫిక్స్!
X
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్.. కరీనా కపూర్ జంటకు తైమూర్ అనే రెండేళ్ళ వయసున్న బాబు ఉన్నాడు. క్యూట్ లుక్స్ తో ఎప్పుడూ మీడియా దృష్టిని ఆకర్షించే తైమూర్ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కూడా రెడీ అవుతున్నాడట. అక్షయ్ కుమార్ ప్రస్తుతం 'గుడ్ న్యూస్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కరీనా హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రంలోనే తైమూర్ ఒక చిన్న పాత్రలో నటిస్తాడట. తైమూర్ పాత్ర నిడివి పది నిముషాల పాటు ఉంటుందని ఇప్పటికే ఈ క్యూట్ బాయ్ కి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేశారని సమాచారం. తైమూర్ ఎంట్రీ సైఫ్ ఫ్యాన్సుకు మాత్రమే కాకుండా కరీనా అభిమానులకు కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ కానుంది. ఇంత చిన్న వయసులో కెమెరాముందుకు వచ్చిన స్టార్ కిడ్స్ చాలా అరుదుగా ఉంటారు. అలా చిన్న వయసులో కెమెరాముందు అవలీలగా నటించేసిన బుడుగులలో ఇప్పటి టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ కూడా ఉన్నాడు.

'గుడ్ న్యూస్' లో కియారా అద్వాని.. దిలిజిత్ దొసాంజ్.. జిమ్మీ షెర్గిల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్.. అక్షయ్ కుమార్.. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 6 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.