Begin typing your search above and press return to search.

లండ‌న్ లో ఇండియ‌న్ల‌ను చంపే మాఫియాకి చెక్ పెట్టే తంత్రం!

By:  Tupaki Desk   |   15 Jun 2021 4:00 PM IST
లండ‌న్ లో ఇండియ‌న్ల‌ను చంపే మాఫియాకి చెక్ పెట్టే తంత్రం!
X
త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ న‌టించిన తాజా చిత్రం `జ‌గ‌మే తంత్రం` (జ‌గ‌మే తందిరం) గ‌త కొంత‌కాలంగా ట్రెండీ టాపిక్ గా మారింది. ఈ మూవీ స్టార్ కాస్ట్ క‌థాంశం గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తాజాగా జ‌గ‌మే తంత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగుకి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి పేట ఫేం కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సినిమా కథాంశం ఆద్యంతం ఆస‌క్తిని క‌లిగించ‌నుంద‌ని తెలిసింది. ఇందులో ధ‌నుష్ ఒక గ్యాంగ్ స్ట‌ర్ గా క‌నిపిస్తారు. లండ‌న్ లో భార‌తీయుల్ని చంపే మాఫియా భ‌ర‌తం ప‌ట్టేవాడిగా అత‌డి న‌ట‌న మ‌రో లెవ‌ల్లో ఉంటుంద‌ని తెలిసింది.

జ‌గ‌మే తంత్రం 65కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కింది. నెట్ ఫ్లిక్స్ 55కోట్ల‌కు రైట్స్ ని కొనుక్కుంది. శాటిలైట్ రూపంలో మ‌రో 10కోట్లు నిర్మాత‌ల‌కు ద‌క్కింద‌ని తెలిసింది. నిజానికి ఈ సినిమాని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తే అంత‌కుమించి వ‌సూళ్లు ద‌క్కేవ‌ని చిత్ర‌బృందం భావించినా చివ‌రికి క్రైసిస్ వ‌ల్ల రాజీకి రాక త‌ప్ప‌లేదు. ఇక ధ‌నుష్ స్ఫూర్తితో ఇత‌రులు ఓటీటీల‌కు త‌మ సినిమాల్ని క‌ట్ట‌బెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.