Begin typing your search above and press return to search.

షూట్‌ తర్వాతా షూటింగ్‌కొస్తోంది

By:  Tupaki Desk   |   26 Jun 2015 7:30 PM GMT
షూట్‌ తర్వాతా షూటింగ్‌కొస్తోంది
X
కథానాయికల జీవితంలో ఎన్నో ఒడిదుడుకులుంటాయి. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా బోలెడన్ని ఆసక్తికర సంగతులు ఉంటాయి. అయితే వృత్తిలో చిరాకుల్ని ఇంట్లో చూపించకూడదు. అలా చూపించకుండా నడిపిస్తేనే నిజ జీవితంలో సమస్యలు రావు. కానీ టబు లాంటి నటీమణికి ఆ అవసరం కూడా రాదు ఎప్పటికీ. ఇంట్లోనూ, బైటా ఎప్పుడూ ప్రశాంతంగానే కనిపిస్తుంది. సంసార బంధనాలేవీ లేవు కాబట్టి ఇదంతా సాధ్యమవుతోంది.

అయితే ఒకటి మాత్రం ఇటీవలి కాలంలో చికాకులు పెట్టేస్తోంది. పగలు షూటింగుకి వెళ్లడం, రేయిలో ప్రమోషన్‌కి రావడం ఇదంతా పెద్ద నరకం అయిపోతోంది. ఇదే సంగతిని టబు స్వయంగా చెప్పింది. అన్నట్టు టబు ఇటీవలి కాలంలో ముఖానికి రంగేసుకుని చాలా కాలమే అయ్యింది. అప్పట్లో హైదర్‌ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషించి ఆకట్టుకుంది. ప్రస్తుతం మలయాళ హిట్‌ చిత్రం 'దృశ్యం' రీమేక్‌లో నటిస్తోంది. ఇందులో ఓ పోలీసాఫీసర్‌గా కనిపిస్తుంది. కొడుకుని కోల్పోయి ఆ కేసును డీల్‌ చేసే అధికారిగా, తల్లిగా ఒకే ముఖంలో రెండు ఎక్స్‌ప్రెషన్స్‌ని చూపించే పాత్ర అది. తెలుగులో నదియా ఈ పాత్రను పోషించింది.

ఇటీవలి కాలంలో షూటింగ్‌ చేస్తూనే టబు ప్రచారంలో పాల్గొంటోంది. ఎందుకంటే ఇప్పటికే జూలైలో సినిమా రిలీజ్‌ అంటూ తేదీ ప్రకటించేశారు. కాబట్టి ఇప్పట్నుంచే ప్రచారార్భాటం మొదలైంది. అందుకే ఇలా రేయింబవళ్లు శ్రమించాల్సొస్తోంది. అదీ సంగతి.