Begin typing your search above and press return to search.

అయ్యో.. టబు అటు వెళ్లిపోతోందా!!

By:  Tupaki Desk   |   8 July 2017 11:20 AM GMT
అయ్యో.. టబు అటు వెళ్లిపోతోందా!!
X
హైద్రాబాదీ భామ అయినా.. బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టి.. టాలీవుడ్ లో మెరిసి.. బాలీవుడ్ లో ఓ రేంజ్ కు ఎదిగి.. సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించిన బ్యూటీ టబు. ఇప్పుడు ఈ భామ వయసు 45 సంవత్సరాలు. సీనియర్ హీరోయిన్ స్టేటస్ తో ఇప్పటికీ వెలుగుతూనే ఉంది.

ప్రస్తుతం టబు కెరీర్ కీలక దశకు చేరుకుందని చెప్పాలి. కౌంట్ విషయంలో అయితే సినిమాలు బాగా తగ్గిపోయాయని ఒప్పుకోవాల్సిందే. ఇక సెటిల్ అయిపోయే ఉద్దేశ్యంలో ఉందిట ఈ బ్యూటీ. కెరీర్ నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచన కూడా చేస్తోందట. కెరీర్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఎక్కడ సెటిల్ అవాలనే విషయంపై తీవ్రంగా ఆలోచించిన టబు.. చివరకు గోవాకు మొగ్గినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా గోవాలో ఓ అపార్ట్ మెంట్ కూడా కొనుక్కుంది టబు. సన్నిహితులు నిర్మించిన ఓ ఐదంతస్తుల అపార్ట్ మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉండనుంది టబు. అయితే.. ఈ హైద్రాబాదీ బ్యూటీకి ఇక్కడే ఓ బంగళా ఉంది. ప్రస్తుతం దాన్ని రెంట్ కి ఇచ్చేసింది.

బాలీవుడ్ కి రిటైర్మెంట్ చెప్పేశాక.. హైద్రాబాద్ వచ్చి సెటిల్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ టబు మాత్రం ఆఖరి క్షణంలో ఇలా గోవా వెళ్లిపోవాలని డిసైడ్ అయిపోవడంతో.. ఈ విషయం తెలిసిన అనేకమంది.. తెగ ఫీలయిపోతున్నారు.