Begin typing your search above and press return to search.

తెలుగులో తాప్సీ.. ఎన్నాళ్లకెన్నాళ్లకో!!

By:  Tupaki Desk   |   16 Dec 2016 9:30 AM GMT
తెలుగులో తాప్సీ.. ఎన్నాళ్లకెన్నాళ్లకో!!
X
ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ట్యాలెంట్ చూపించేస్తోంది. తమిళ్ లో చెలరేగిపోయి బాలీవుడ్ లో సక్సెస్ కొట్టేసి మహా జోరు మీద ఉంది. అయితే.. తను అరంగేట్రం చేసిన.. అసలు సినిమాల్లో అవకాశం ఇచ్చిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఈ మధ్య కొన్నేళ్లుగా ట్యాలెంట్ చూపించలేదు తాప్సీ. అసలు తెలుగులో సినిమానే చేయనప్పుడు ఇక ట్యాలెంట్ చూపించే మాట ఎక్కడి నుంచి వస్తుందిలెండి.

మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన గోపీచంద్ మూవీ సాహసం తప్ప.. తెలుగులో సినిమా చేయలేదు. మధ్యలో దొంగాటలో ఓ కేమియో ఇచ్చిందంతే. ప్రస్తుతం దగ్గుబాటి రానాతో ఘాజీలో నటిస్తున్నా.. ఇది హిందీ.. తెలుగు బై లింగ్యువల్. కానీ ఇన్నేళ్లకు తాప్సీ ఓ తెలుగు సినిమా యాక్సెప్ట్ చేయడం విశేషం. పాఠశాల ఫేమ్ మహి రాఘవ్ దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ హారర్ కామెడీలో నటించేందుకు తాప్సీ సైన్ చేసిందట.

హారర్ జోనర్ కొత్త యాంగిల్ చూపించేందుకు ఈ దర్శకుడు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. మల్టీ స్టారర్ అంటున్నారు కానీ.. ఈ హారర్ సినిమాలో టైటిల్ రోల్ ని తాప్సీ పోషించనుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/