Begin typing your search above and press return to search.

హీరోల పారితోషికంపై మ‌ళ్లీ విరుచుకుప‌డింది!

By:  Tupaki Desk   |   2 July 2022 4:27 AM GMT
హీరోల పారితోషికంపై మ‌ళ్లీ విరుచుకుప‌డింది!
X
బాలీవుడ్ లో బ‌యోపిక్ ల ట్రెండ్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా బ‌యోపిక్ ల నిర్మాణానికి మేక‌ర్స్ సిద్ధంగా ఉంటున్నారు. యువ‌త‌రంలో స్ఫూర్తి నింపేలా క్రీడా బ‌యోపిక్ లు స‌హ‌క‌రిస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. ఈ త‌ర‌హా బ‌యోపిక్ ల‌తో లాభాలు క‌ళ్ల జూసారు .. కానీ కొన్నిసార్లు ప‌రాజ‌యాలు త‌ప్ప‌డం లేదు. దానికి ఇటీవ‌ల విడుద‌లైన 83 ఎగ్జాంపుల్. 83 రిలీజైనా కేజీఎఫ్ 2 ముందు ఏమాత్రం నిల‌బ‌డ‌లేక‌పోయింది. మాస్ కంటెంట్ ముందు క్లాస్ కాన్సెప్ట్ తేలిపోయింది.

కానీ ఇప్పుడు దానిని అధిగ‌మించేందుకు శ‌భాష్ మిథు వ‌స్తోంది. భార‌త మ‌హిళా క్రికెట్ కెప్టెన్ మిథాలిరాజ్ జీవిత‌క‌థ ఆధారంగా రూపొందుతున్న చిత్ర‌మిది. తాప్సీ పన్ను క‌థానాయిక‌. బాలీవుడ్ లో నాయికా ప్ర‌ధాన చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఒక ఒర‌వ‌డి ఉంద‌ని నిరూపించిన తాప్సీ ఈసారి బ‌యోపిక్ తో అద‌ర‌గొట్టాల‌ని పంతంతో ప‌ని చేసింది. మ‌హిళల హక్కుల విష‌యంలో తాప్సీ ఎప్పుడూ త‌న గొంతు వినిపిస్తూనే ఉంది.

మ‌హిళా సమానత్వంపై దృఢ విశ్వాసం క‌లిగి ఉన్న న‌టిగా పాపుల‌రైంది. తాజాగా ఇండ‌స్ట్రీలో అస‌మాన‌త్వం గురించి అవకాశాల కోసం తన పోరాటం గురించి తాప్సీ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. సినిమాల్లో హీరోయిన్లు నటీమణుల పరిస్థితి గురించి ఓపెనైంది. మేల్ ఆధారిత సినిమాలు.. స్త్రీ-ఆధారిత సినిమాల మధ్య వ్యత్యాసంపైనా తాప్సీ మాట్లాడింది.

తాజా ఇంటర్వ్యూలో తాప్సీ పన్ను శభాష్ మిథు బడ్జెట్ గురించి స్పష్టంగా చెప్పింది. త‌న‌కు A-లిస్టర్ హీరో పారితోషికం కంటే త‌న సినిమా బ‌డ్జెట్ చిన్న‌ది అని కూడా తెలిపింది. శ్రీదేవి సూపర్ స్టార్ గా ఉన్న క్ర‌మంలోనే చాలా మంది మగ నటులు సూపర్ స్టార్ లుగా ఉన్నారని పోలిక‌ చెబుతూ.. మహిళా నటీమణులకు అవకాశాలు త‌క్కువ అని పేర్కొంది. శభాష్ మిథు కథానాయికగా నా కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రం. అయినప్పటికీ నా సినిమా మొత్తం బడ్జెట్ ఎ-లిస్టర్ (మేల్ స్టార్) పారితోషికం కంటే త‌క్కువ లేదా సమానం అని అంది.

అంతేకాదు ఫ్లాప‌ల్లో ఉన్న ఏ లిస్ట‌ర్ హీరోల‌పైనా తాప్సీ త‌న‌దైన శైలిలో సెటైర్లు వేసింది. "A-లిస్టర్స్ అంటే అగ్రస్థానంలో లేని ఫ్లాపుల్లో ఉన్న‌ A-లిస్టర్ ల గురించి మాట్లాడుతున్నాను. నేను నిచ్చెన (స్టార్ డ‌మ్) నుండి కొంచెం దిగువన ఉన్న హీరోల‌ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ల జీతం నా సినిమా మొత్తం బడ్జెట్ తో స‌మానం లేదా ఎక్కువ‌. ఇప్పటికీ పరిస్థితి అలాగే ఉంది.

కాబట్టి మ‌హిళ‌లు ముందుకు వెళ్ళడానికి ఇంకా చాలా దూరం ఉంది.. అంటూ త‌న‌దైన శైలిలో తాప్సీ కౌంట‌ర్లు వేసింది. నటీమణులుగా మేము ఈ టాపిక్ ని తెర‌పైకి తెచ్చాం. మేము ఈ విభేదాలను తగ్గించడానికి ప్రయత్నిస్తూ.. సరైన దిశలో ముందుకు సాగామని తాప్సీ పేర్కొన్నారు. ఇది 10-12 సంవత్సరాల క్రితం మొద‌లై ఉంటే.. నేను ఇక్కడ కూర్చుని ఇలాంటి చిత్రాన్ని ప్రమోట్ చేసేదానిని కాదని నాకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి పరిస్థితులు మారాయి. కానీ ఎక్కడా దీనిని స‌మాన‌త్వం అని అన‌లేం! అని అన్నారు.

శభాష్ మిథు గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రం మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత క‌థ‌తో తెర‌కెక్కింది. పురుషాధిక్య క్రీడల మధ్య క్రికెటర్ కావాలని కలలు కనే ఆమె ప్రయాణం నుండి ప్రేరణ పొంది రూపొందించారు.. అని తెలిపారు. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 15న విడుదల కానుంది.