Begin typing your search above and press return to search.
మిథాలీరాజ్ బయోపిక్.. తాప్సీ సర్వసన్నాహకాలు!
By: Tupaki Desk | 28 Jan 2021 2:27 PM ISTబయోపిక్ ల హవా ఇప్పట్లో ఆగేట్టు లేదు. వీలున్నన్ని బయోపిక్ లను తెరకెక్కించాలన్న కసి పట్టుదల మేకర్స్ లో స్పష్ఠంగా కనిపిస్తోంది. ప్రముఖుల జీవిత విశేషాల్లో సంథింగ్ స్ఫూర్తి పొందే మ్యాటర్ ఉంటే వాటిని సినిమాలుగా మలిచేందుకు దర్శకనిర్మాతలు.. స్టార్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.
ముఖ్యంగా క్రీడా బయోపిక్ లపై మోజు అంతకంతకు పెరుగుతోంది. గత కొంతకాలంగా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ పాత్రలో తాప్సీ పన్నూ నటించనుందని ప్రచారమవుతోంది. ఎట్టకేలకు ఈ చిత్రానికి సంబంధించిన శిక్షణను తాప్సీ ప్రారంభించింది. వేరొక సినిమా షూటింగులో పాల్గొంటూనే క్రికెట్ లో శిక్షణ మొదలెట్టేయడం ఆసక్తికరం.
శిక్షణ సెషన్స్ నుంచి తాజాగా తాప్సీ ఓ ఫోటోని షేర్ చేసింది. దీనికి ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చింది. మిథాలీలా బ్యాట్ పట్టుకున్న చిత్రాన్ని షేర్ చేసిన తాప్సీ ట్విట్టర్ లో వ్యాఖ్యను జోడించింది “ బ్యాట్ తో బంతి రొమాన్స్ మొదలైంది .... చాలా దూరం వెళ్ళాలి ఇంకా.. మంచి ప్రారంభంతో సగం పని పూర్తయినట్టే.. ఈ మూవీ మరో మైలురాయి కానుంది .... మా కెప్టెన్ కూల్ మిథాలి రాజ్.. షాభాష్ మిథు...!!`` అంటూ వ్యాఖ్యానించింది.
బ్యాక్ టు బ్యాక్ ఆరు ఫోటోల్ని తాప్సీ షేర్ చేసింది. వీటిలో మల్టీ టాస్కింగ్ చేస్తోంది. గోవాలో `లూప్ లాపెటా` చివరి షెడ్యూల్ కోసం ఆమె షూటింగ్ ప్రారంభించినా.. తదుపరి చిత్రం `షాబాష్ మిథు` కోసం శిక్షణను ప్రారంభించింది. కోచ్ నూషిన్ అల్ ఖాదీర్ ఆధ్వర్యంలో తాప్సీ క్రికెట్ లో శిక్షణ పొందుతోంది. తాను ఎప్పుడూ క్రికెట్ ఆడకపోయినా.. ఈ ఆటకు గొప్ప వీరాభిమానిని అని తాప్సీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ రోల్ నా కెరీర్ లో భారీ సవాల్ అని అన్నారు. ఒత్తిడి నాలోని ఉత్తమ క్వాలిటీని బయటకు తెస్తుంది. నాకు .. మిథాలీకి మధ్య నేను గుర్తించగలిగే ఒక సాధారణ లక్షణం ఇదే అని వెల్లడించింది.
ప్రియా అవెన్ స్క్రిప్ట్ అందించిన `షాబాష్ మిథు` భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితం చుట్టూ తిరుగుతుంది. రాహుల్ ధోలాఖియా దర్శత్వంలో ఈ మూవీని వయాకామ్ 18 సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తాప్సీ ప్రస్తుతం జర్మన్ హిట్ `రన్ లోలా రన్` అధికారిక రీమేక్ అయిన `లూప్ లాపెటా` చిత్రీకరణలో పాల్గొంటోంది. తాప్సీ లైనప్ లో వరుస సినిమాలున్నాయి. షాభాష్ మిథు.. హసీన్ దిల్ రూబా... రష్మి రాకెట్.. దీపక్ సుందరాజన్ తమిళ చిత్రం.. అనురాగ్ కశ్యప్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కూడా ఉన్నాయి.