Begin typing your search above and press return to search.

తాప్సీ మళ్లీ రచ్చ మొదలెట్టింది!!

By:  Tupaki Desk   |   20 Feb 2018 9:26 AM GMT
తాప్సీ మళ్లీ రచ్చ మొదలెట్టింది!!
X
ఏదైనా సినిమా వస్తోందంటే చాలు.. ప్రచారం కోసం నానా రకాల టెక్నిక్స్ అమలు చేయడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా వివాదం సృష్టించే మాటలు మాట్లాడ్డంతో.. కాంట్రవర్సీ క్రియేట్ చేసి అనాల్సింది అనేయడం.. ఇటు సినిమాకు ప్రచారం.. రెండు విధాల ప్రచారం వచ్చేస్తోంది. ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను కూడా ఇలాంటి ఐడియాలు బాగానే నేర్చింది.

సామాన్యంగా సైలెంట్ గానే ఉండే ఈ సుందరి.. కొత్త సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఏదో ఒక పాయింట్ ను ఫోకస్ చేస్తూ ఉంటుంది. గతంలో దక్షిణాది సినిమాలపై హడావిడి చేసి ప్రచారం పొందిన ఈ బ్యూటీ.. ఇప్పుడు దిల్ జంగ్లీ అనే సినిమా వస్తుండడంతో ఇంకో టాపిక్ గురించి స్టార్ట్ చేసింది. అందుకే ఇప్పుడు.. సినిమా రంగంలో వారసత్వం గురించి కబుర్లు స్టార్ట్ చేసేసింది. ఎంతో కష్టపడి పైకొచ్చే వారి కంటే.. తారల వారసులు సినిమాల్లోకి రావడం ఈజీగా ఉంటోందని.. మీడియా అటెన్షన్ కూడా వారిపై ఎక్కువగా ఉంటోందని.. ఏం సాధించకుండానే వారికి బోలెడంత ప్రచారం వచ్చేస్తోందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తాప్సీ.

కొత్త సినిమా రిలీజ్ అవుతోంది అంటే చాలు.. తాప్సీ ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటుంది. మళ్లీ ఇలాంటి కబుర్లు చెప్పడం మొదలెట్టింది. ప్రస్తుతం తన ట్యాలెంట్ సౌత్ జనాలకు తెలియడంతో.. ఇప్పుడు తన కోసం వారి షూటింగ్ షెడ్యూల్స్ కూడా మార్చుకుంటున్నారని చెబుతోంది తాప్సీ పన్ను.