Begin typing your search above and press return to search.

రియల్ లైఫ్ నేను అట్టాంటిదాన్ని కాదు

By:  Tupaki Desk   |   11 March 2017 4:07 AM GMT
రియల్ లైఫ్ నేను అట్టాంటిదాన్ని కాదు
X
ఢిల్లీ భామ తాప్సీ ఇప్పుడు మాంచి హుషారు మీద ఉంది. కొన్ని నెలల క్రితం పింక్ మూవీ అనూహ్య విజయం సాధించేసి.. తన నటనకు మంచి పేరు తెచ్చిపెట్టేయడమే కాకుండా.. కాసుల వర్షం కూడా కురిపించేసింది. ఇప్పుడు నామ్ షబానా అంటూ మరో ఫిమేల్ సెంట్రిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.

నామ్ షబానా మూవీలో తాను పోషించిన పాత్రకు.. రియల్ లైఫ్ లో తన కేరక్టర్ కు అస్సలేమాత్రం సంబంధం లేదంటోంది తాప్సీ పన్ను. 'సహజంగా అయితే.. నేను ఎదుటివారిని చెంపదెబ్బ కూడా కొట్టలేను. స్కూల్ డేస్ నుంచి స్పోర్ట్స్ లో ఉండడంతో హైపరాక్టివ్ గా ఉంటానంతే. అందుకే అలా కనిపిస్తా కానీ.. నిజ జీవితంలో నేను అహింసనే పాటించేస్తాను' అని చెబుతున్న తాప్సీ.. నామ్ షబానా మూవీలో భయమే ఎరుగని పోలీస్ పాత్రలో కనిపించేయనుంది.

ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ల కోసం ఎంతో సాధన చేశానని చెప్పిన తాప్సీ.. కొన్నిసార్లు ఫిజియో థెరపీ కూడా తీసుకున్నట్లు చెప్పింది. బేబీ చిత్రానికి ప్రీక్వెల్ గా నామ్ షబానా తెరకెక్కుతుండగా.. టీం అంతా గతంలో పని చేసిన వారే కావడంతో ఈ సినిమా చేస్తున్నపుడు కొత్తగా ఏం అనిపించలేదని అంటోంది. అక్షయ్ కుమార్ చేసిన కేమియో.. నామ్ షబానాకు స్పెషల్ అట్రాక్ట్ అవుతుందని తాప్సీ చెబుతుండగా.. ఈ నెల 31న నామ్ షబానా రిలీజ్ అవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/