Begin typing your search above and press return to search.

కలరింగ్ కి తాప్సీ భలే కవరింగ్

By:  Tupaki Desk   |   29 Sep 2017 9:31 AM GMT
కలరింగ్ కి తాప్సీ భలే కవరింగ్
X
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి అప్ గ్రేడ్ అయిన తాప్సీ పన్ను.. అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలోనే గుర్తింపు సంపాదించింది. పింక్ మూవీలో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించి కూడా తన పాత్రకు నటనకు గుర్తింపు సాధించిందంటే.. ఏ రేంజ్ ట్యాలెంట్ చూపిందో అర్ధమవుతుంది. ఆ తర్వాత నామ్ షబానా అంటూ ఓ యాక్షన్ ప్రయోగం చేయగా.. సినిమా అంతగా ఆడలేదు కానీ.. అమ్మడికి మాత్రం బాగానే ప్రశంసలు వచ్చాయి.

ఇదే ఊపులో తన యాక్టింగ్ ట్యాలెంట్ ను ఆకాశానికి ఎత్తేసుకుని.. టాలీవుడ్ ని తూలనాడేసి.. దక్షిణాది సినిమాల్లో తనకు నటించే అవకాశం ఇవ్వకపోవడంతోనే.. ఇన్నేళ్లూ తన ప్రతిభ మరుగున పడిపోయిందని తెగ బాధపడిపోయింది తాప్సీ. కానీ అంతలోనే జుడ్వా2 అంటూ ఫుల్ లెంగ్త్ గ్లామర్ రోల్ లో నటించేసి.. ఇప్పుడా మూవీని రిలీజ్ కి కూడా రెడీ చేసేసింది. అందాల ప్రదర్శనపై అన్నేసి నీతులు చెప్పి.. ఇప్పుడు ఏకంగా బికినీలు కూడా వేసుకుంటూ సినిమా చేయడంపై అందరూ షాక్ తినేశారు. దీనికి కూడా తాప్సీ దగ్గర నుంచి భలే ఆన్సర్ వచ్చేసింది.

"పెర్ఫామెన్స్ అంటూ ఒకే తరహా పాత్రలు చేస్తే.. ఇకపై అన్నీ అలాంటి రోల్స్ మాత్రమే వస్తాయి. అందుకే జనాలను సర్ ప్రైజ్ చేయాలనే ఉద్దేశ్యంతో జుడ్వా2 అంగీకరించాను. కేవలం ఇంటెన్సిటీ ఉన్న పాత్రలే కాకుండా.. ఇలాంటి గ్లామర్ రోల్స్ కూడా తాప్సీ చేయగలదు అని అందరూ అనుకోవాలి" అంటూ తన గ్లామర్ కలరింగ్ కి.. సూపర్బ్ కవరింగ్ ఇచ్చింది తాప్సీ. పెద్ద బ్యానర్.. పెద్ద కాన్వాస్.. పెద్ద బడ్జెట్.. అన్నిటికీ మించి భారీ రెమ్యూనరేషన్ వస్తుంది.. ఇది చెప్పడం మానేసి.. మిగతావన్నీ ఎందుకంటావ్ తాప్సీ?