Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ లుక్‌ : మిథాలీగా తాప్సి

By:  Tupaki Desk   |   29 Jan 2020 8:42 AM GMT
ఫస్ట్‌ లుక్‌ : మిథాలీగా తాప్సి
X
మహిళ టీం ఇండియా జట్టు అనగానే ఠక్కున వినిపించే పేర్లు.. గుర్తుకు వచ్చే క్రీడాకారిణి మిథాలీ రాజ్‌. దాదాపు రెండు దశాబ్దాలుగా క్రికెట్‌ ఊరిపిగా జీవిస్తూ మహిళ టీం ఇండియా జట్టుకు అద్బుత విజయాలను అందించిన గొప్ప క్రీడాకారిణిగా మిథాలీ రాజ్‌ ఇండియన్‌ క్రికెట్‌ చరిత్రలో నిలిచి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈమె జీవిత చరిత్రను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో తెరకెక్కించిన చిత్రం 'శబాష్‌ మిథు'.

ఈ చిత్రంలో మిథాలీ రాజ్‌ పాత్రను సొట్టబుగ్గల చిన్నది తాప్సి చేస్తున్న విషయం తెల్సిందే. ఈ పాత్ర కోసం తాప్సి క్రికెట్‌ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడంతో పాటు చాలా హోమ్‌ వర్క్‌ చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. నేడు విడుదలైన ఫస్ట్‌ లుక్‌ ను చూస్తుంటే తాప్సి పడ్డ కష్టం కనిపిస్తుంది. మిథాలీని దించేందుకు బాడీ పరంగా.. బాడీలాంగ్వేజ్‌ పరంగా.. ఇతర విషయాల పరంగా చాలా కష్టపడ్డట్లుగా తెలుస్తుంది.

ఇక ఈ చిత్రంను వయోకమ్‌ 18 సంస్థ నిర్మిస్తుండగా రాహుల్‌ ధోలాకియా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. తాప్సి ఈ చిత్రం కోసం పలు చిత్రాలను కూడా వదులుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. హిందీతో పాటు తెలుగు మరియు ఇతర భాషల్లో కూడా శబాష్‌ మిథును విడుదల చేసే ఆలోచనలో వయోకమ్‌ 18 సంస్థ ఉన్నట్లుగా తెలుస్తోంది.