Begin typing your search above and press return to search.

కరణ్ జోహార్ షో పై గట్టి పంచ్ వేసిన తాప్సీ!

By:  Tupaki Desk   |   6 March 2019 11:05 AM IST
కరణ్ జోహార్ షో పై గట్టి పంచ్ వేసిన తాప్సీ!
X
డింపుల్ బ్యూటీ తాప్సీ పన్ను చాలా తెలుగు సినిమాలలో నటించినా ఇక్కడ స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయింది. కానీ తన బాలీవుడ్ జర్నీ మాత్రం కిరాక్ స్టైల్ లో కొనసాగుతోంది. తన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. నటన విషయంలోనే అందరిచేత మెప్పు పొందడమే కాదు.. తాప్సీకి ఒక స్ట్రాంగ్ వుమన్ అనే పేరుంది. చుట్టూ జరిగే విషయాలపైన స్పందించడమే కాదు.. అప్పుడప్పుడూ గట్టిగా సెటైర్లు కూడా వేస్తుంది.

రీసెంట్ గా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమాన్ని నిర్వహిస్తాడనే సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ కార్యక్రమం ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఆరో సీజన్ చివరి ఎపిసోడ్ లో స్టాండప్ కమెడియన్ టర్న్డ్ యాక్టర్ వీర్ దాస్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ షో జరిగే సెట్ పూర్తిగా పింక్ గా ఉండడం చూసి ఒక సందర్భంలో "ఇక్కడ ఫుల్ గా పింక్ ఉంది.. తాప్సీ నటించేందుకు ప్రయత్నించిందేమో" అంటూ జోక్ పేల్చాడు. తాప్సీకి 'పింక్' సినిమాతోనే బాలీవుడ్ లో బ్రేక్ వచ్చిందనే సంగతి తెలుసుకదా. దానిపై జోక్ అన్నమాట. దీంతో కరణ్ జోహార్ కూడా పగలబడి నవ్వాడు.

స్టొరీ ఇంతటితో అయిపోతే తాప్సీ ప్రత్యేకత ఏముంది? ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ "హహహహహ నైస్ జోక్. కాకపోతే తాప్సీ ఇంకా అక్కడ కూర్చునేందుకు మాత్రం ఇంకా అర్హత సంపాదించలేదు. ఈ ఎపిసోడ్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నా. మీరందరూ భలే భలే ఫన్నీ" అంటూ ట్వీటింది. ఈ ట్వీట్ కు స్పందించిన వీర్ దాస్ "తాప్సీ మీరే పని చేసినా బ్రిలియంట్ గా ఉంటుంది. మీకు కావాల్సిన అర్హత అదే!" అంటూ రిప్లై ఇచ్చాడు.

కాఫీ విత్ కరణ్ షో లో అనన్య పాండే.. జాన్వి కపూర్ లాంటి లాంటి ఒక సినిమా మాత్రమే చేసిన వారు.. ఇంకా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వనివారిని కూడా పిలిచిన కరణ్ ఇంతవరకూ తాప్సీని పిలవకపోవడం ఆశ్చర్యమే. దీంతో నెటిజనులు గట్టిగానే కరణ్ జోహార్ ను తగులుకున్నారు. ఇది 'కాఫీ కోచ్' అని విమర్శించారు. కష్టపడి పైకొచ్చిన వారిని కరణ్ గుర్తించడం లేదని ట్రోల్ చేశారు .