Begin typing your search above and press return to search.

తాప్సి గ్లామర్ ట్రీట్.. స్టైలిష్ స్టిల్స్

By:  Tupaki Desk   |   14 July 2022 1:30 PM GMT
తాప్సి గ్లామర్ ట్రీట్.. స్టైలిష్ స్టిల్స్
X
సొట్ట బుగ్గల సుందరి తాప్సి ఒకప్పుడు తెలుగులో రెగ్యులర్ హీరోయిన్ గా సినిమాలు చేసినప్పటికీ ఆమెకు అంతగా క్రేజ్ అయితే దక్కలేదు. ఇక బాలీవుడ్ లోకి వెళ్లిన తరువాత మాత్రం అక్కడ అమ్మడికి టైమ్ బాగానే కలిసొచ్చింది. మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక అవకాశాలకు తగ్గట్టుగా తాప్సి కూడా బాగానే హార్డ్ వర్క్ చేస్తోంది.

బాలీవుడ్ లో కేవలం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా చాలా విభిన్నమైన కథలను కూడా సెలెక్ట్ చేసుకుంటోంది. తాప్సి అవార్డ్ విన్నింగ్ పాత్రల్లో కూడా మెప్పిస్తూ తన స్థాయిని పెంచుకుంటోంది.

తాప్సి ఇటీవల కాలంలో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకుంది అంటే తప్పకుండా అందులో ఎదో ఒక కొత్త తరహా పాయింట్ ఉంటుంది అనేలా ప్రేక్షకుల్లో ఒక మంచి నమ్మకం అయితే ఏర్పరచుకుంటోంది.

ఇక గ్లామర్ విషయంలో కూడా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటోంది. ఇక ఈ బ్యూటీ నుంచి నెక్స్ట్ అయితే మరికొన్ని మంచి సినిమాలు రానున్నాయి. ఇక ఈ తరుణంలో కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది.

ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఫొటో షూట్ లో తాప్సి మత్తెక్కించే అందాలతో షాక్ ఇచ్చింది. ఒకవైపు క్లివేజ్ అందాలు మరోవైపు లెగ్స్ అందాలు హైలెట్ అయ్యే విధంగా అదిరిపోయే స్టిల్స్ అయితే ఇచ్చింది.

ఇక ఆ ఫొటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాప్సికి సంబంధించిన తదుపరి సినిమా శభాష్ మీతు ఈ శుక్రవారం రోజు వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇమెటర్నెషనల్ ఉమెన్ క్రికెటర్ మిథాలి రాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై తాప్సి చాలా ఆశలు పెట్టుకుంది. మరి సినిమా రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి. అలాగే తాప్సి త్వరలోనే ఒక తెలుగు సినిమాలో కూడా నటించబోతున్నట్లు సమాచారం.