Begin typing your search above and press return to search.

తాప్సీ బికినీలను పట్టించుకోవట్లేదా?

By:  Tupaki Desk   |   3 Oct 2017 4:23 AM GMT
తాప్సీ బికినీలను పట్టించుకోవట్లేదా?
X
తన హాట్ అందాలతో బాలీవుడ్ జనాలను ఎలా ఆకట్టుకోవాలో శ్రీలంక అందం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు బాగానే తెలుసు. కమర్షియల్ సినిమాల్లో ఏ రేంజిలో ఆరబోస్తే జనాలు ఎట్రాక్ట్ అవతారో ఈ భామకు ఓరకంగా కొట్టిన పిండి. వెండితెరపై బికినీ సీన్లలో ఏ మాత్రం మొహమాటపడకుండా యాక్ట్ చేస్తూ జాకి ఎప్పటికప్పుడు అభిమానులను కవ్విస్తూనే ఉంటోంది.

తాజాగా ఈమె హీరోయిన్ గా నటించిన జుడ్వా-2 థియేటర్లకొచ్చింది. అప్పట్లో తెలుగులో నాగార్జున హీరోగా నటించిన హలో బ్రదర్ కు సీక్వెల్ కథతో మరో కవల సోదరుల స్టోరీతో ఈ సినిమా తీశారు. ఇందులో వరుణ్ ధావన్ డబుల్ రోల్ లో హీరోగా నటించాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు షిఫ్టయిన సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను ఈ సినిమాలో రెండో సుందరాంగిగా కనిపించింది. తాప్సీ - జాక్వైలైన్ ఇందులో పోటాపోటీగా అందాలు ధారాళంగా ఆరబోశారు. ఇద్దరూ బికినీలతో కనువిందు చేశారు. కానీ జాక్వెలైన్ హాట్ నెస్ ముందు తాప్సీ తేలిపోయిందని బాలీవుడ్ జనాలు పెదవి విరిచేస్తున్నారు. బికినీలో జాక్వెలైన్ అదరగొట్టేలా ఉందంటూ తాప్సీకి మాత్రం అరకొర మార్కులతో సరిపెట్టేస్తున్నారు.

ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాలో నటించడం జాక్వెలైన్ కు కొత్తేం కాదు. రేస్-2లో హాట్ సీన్లలో రెచ్చిపోయి నటించిన దీపికా పదుకునేకు దీటుగా తన అందాలతో మత్తెక్కించేసింది. తర్వాత వచ్చిన హౌస్ ఫుల్-3లోనూ లీసా హేడెన్ - నర్గీస్ ఫక్రి పక్కనే ఉన్నా ప్రేక్షకుల చూపు తనపైపే ఉండేలా అట్రాక్ట్ చేయగలిగింది. అలాంటి జాకీ ముందు బాలీవుడ్ లో అందాలు ఆరబోయడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న తాప్సీ మొత్తంగా తేలిపోయింది. జాక్విలైన్ దెబ్బకు తాప్సీ బికినీ షోను పట్టించుకునే వారు కరవయ్యారు అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.