Begin typing your search above and press return to search.

తాప్సీ.. బికినీ వేయక తప్పలేదు

By:  Tupaki Desk   |   29 July 2017 9:12 AM GMT
తాప్సీ.. బికినీ వేయక తప్పలేదు
X
ఝుమ్మంది నాదంతో తన ముద్దు మోముతో తెలుగు ప్రేక్షకులు అభిమానాన్ని పొందిన హీరోయిన్ తాప్సీ ఇప్పుడు అవసరంలేని కామెంట్లు చేసి విమర్శల పాలైంది. ఒక నేషనల్ టి‌వి ఇంటర్వ్యూలో తెలుగు సాంగ్స్ పైన సౌత్ సినిమా రొమాన్స్ పై , రాఘవేంద్ర రావు పాటలు చిత్రీకరణల పై కామెంట్లు చేసి ఇక్కడ వాళ్ళ ఆగ్రహానికి గట్టిగానే దెబ్బతినేసింది. దానితో ఆనందో బ్రహ్మ సినిమా ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు క్షమాపనలు కూడా చెప్పుకుంది. కాకపోతే ఇప్పుడు బాలీవుడ్లో యాక్టింగ్ వైజ్ పీకి కట్టలు కట్టేశానని చెప్పిన తాప్సీ.. చివకు బికినీల్లోకి దిగక తప్పలేదు.

పింక్ - నామ్ షబానా లాంటి సినిమాలు చేసి నేను నటించగలును మంచి పాత్రలు ఇవ్వండి అని మీడియా ముందు మొరపెట్టుకున్న తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ కమర్షియల్ సినిమా జూడ్వా2 లో నటిస్తుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే సౌత్ సినిమాలలో అందాలు మాత్రమే చూపిస్తారు అన్న ఈ రింగుల జుత్తుల సుందరి జూడ్వా 2 లో ఏకంగా టూ పీస్ బికినీ వేసి కనిపించింది. వరుణ్ ధావన్ హీరోగా జ్యాక్విలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్ గా నిర్మించిన ఈ సినిమాలో తాప్సీ ఒక బీచ్ సాంగ్ లో ఇలా బికినీ వేసుకొని దాని పై ఏదో చిన్న జాలీల టాప్ ఒకటి వేసుకొని కొత్తగా తన అందాలును మార్కెట్ చేసుకుంటోంది. మరి గ్లామర్ పాత్రలపై నానా కామెంట్లు చేసిన భామ.. ఇప్పుడు ఈ బికినీ వేషాలేంటో!!

సినిమాలు ఏమి చేస్తుంది ఎందుకు చేస్తుంది అనేవి ఆమె సొంత విషయం కానీ ముందు ఆమె తెలుగు సినిమాలు గురించి అన్న మాటలకు ఇప్పుడు జూడ్వా2 లో ఇలా కనిపించిన తీరుకు ఏమైనా పొంతన ఉందా అని తెలుగు ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ లో చేయడానికి ఓకే అయితే టాలీవుడ్ లో చేయడానికి మాత్రం ఈమెకు తనలోని ఆస్కార్ నటి గుర్తొచ్చిందా అన కామెంట్ చేస్తున్నారు.