Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు తాప్సీ దెయ్యం దిగింది!!

By:  Tupaki Desk   |   27 May 2017 2:44 PM IST
ఎట్టకేలకు తాప్సీ దెయ్యం దిగింది!!
X
తెలుగులో సినిమాలు చేయను అంటూ మొండికేసుకు కూర్చున్న తాప్సీ.. బాలీవుడ్ లో ఒకటి రెండు హిట్లకే ఎగసిపడింది కాని.. తిరిగి ఓ ఫ్లాపు రావడంతో ఢీలా పడిపోయింది. కరక్టుగా ఈ సమయంలో ఆమెను ఆదుకోవడానికి అప్పట్లో ఒప్పుకున్న ఒక తెలుగు సినిమా ఒకటి వచ్చేసింది. ఈరోజే ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజైంది. సినిమాలో తాప్సీ రోల్ ఏంటో తెలియదు కాని.. ఆమె పాత్ర ఒక దెయ్యం అని మాత్రం టాక్ ఉంది.

'భలే మంచి రోజు' సినిమాను ప్రొడ్యూస్ చేసిన టీమ్ ఇప్పుడు 'ఆనందో బ్రహ్మ' అంటూ పాఠశాల సినిమా ఫేం మహీ రాఘవ్ డైరక్షన్లో ఒక దెయ్యం కామెడీ రూపొందించారు. ఈ హారర్ కామెడీలో తాప్సీ ఒక చంద్రముఖ తరహా రోల్ చేస్తోందట. ఆల్రెడీ గంగ సినిమాలో అదే పాత్రలో నటించిన తాప్సీ.. ఇప్పుడు మరోసారి ఆ ఫీట్ రిపీట్ చేస్తోందనమాట. ఆనందో బ్రహ్మ మోషన్ పోస్టర్ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే రూపొందించారు. శ్రీనివాస్ రెడ్డి.. వెన్నెల కిషోర్.. రఘు.. షకలక శంకర్.. తదితర కామెడీ గ్యాంగ్ అంతా ఈ సినిమాలో మెయిన్ రోల్స్ చేస్తుండగా.. పదహారణాల తెలుగు బ్యూటి తరహాలో ఓణి వేసుకుని తాప్సీ వారిని లీడ్ చేస్తోంది.

ఈ దెయ్యం పాత్రైనా తాప్సీకి బ్రేక్ తెప్పించి.. ఆమె మనోవ్యధను చల్లారుస్తుందా? అదే ఇప్పుడు చూడాల్సిన అంశం. లెటజ్ సీ.