Begin typing your search above and press return to search.

మళ్ళీ ఇన్నాళ్లకు టాలీవుడ్ మాస్ హీరోతో తాప్సి

By:  Tupaki Desk   |   13 Oct 2022 2:30 AM GMT
మళ్ళీ ఇన్నాళ్లకు టాలీవుడ్ మాస్ హీరోతో తాప్సి
X
సొట్ట బుగ్గల సుందరిగా తెలుగులో ఒకప్పుడు మంచి గుర్తింపును అందుకున్న తాప్సి మొదటి సినిమాతోనే ఓ వర్గం యువతను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం అనే సినిమాతో పరిచయమైన తాప్సీ పన్ను ఆ తర్వాత ఈజీగా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా మారిపోతుంది అని అందరూ అనుకున్నారు.

అయితే బ్యూటీ బ్యాడ్ లక్ ఏమిటో గాని కెరీర్ మరోవైపు తీసుకువెళ్లే తెలుగు సినిమా అయితే తగలలేదు. దాదాపు మీడియం రేంజ్ హీరోలతో ఆమె బాగానే సినిమాలు చేసింది. ప్రభాస్ రవితేజ గోపీచంద్ ఇలా మాస్ హీరోలతో డిఫరెంట్ జానర్స్ లో కూడా సినిమాలు చేసింది. కానీ అవి ఏమి అత్తగా సక్సెస్ కాలేదు. ముఖ్యంగా ఈ బ్యూటీ తెలుగులో చివరగా సాహసం అనే సినిమాతో మంచి గుర్తింపును అందుకొని ఆ తర్వాత మరికొన్ని తెలుగు సినిమాలు చేసింది.

ఇక బాలీవుడ్లోకి ఎప్పుడైతే వెళ్లిందో అక్కడ అమ్మడికి మంచి ఆఫర్స్ వచ్చాయి. బికినీలో కూడా యాక్ట్ చేసింది. మొదట్లో కమర్షియల్ సినిమాలలో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. అనంతరం మీడియం బడ్జెట్ చిన్న బడ్జెట్ సినిమాలలో మంచి కంటెంట్ ఉన్న పాత్రలు చేసి తాప్సి మార్కెట్లో డిమాండ్ పెంచుకుంది. అమితాబ్ బచ్చన్ అక్షయ్ కుమార్ అలాగే మిగతా హీరోల సినిమాల్లో కూడా ఆమె డిఫరెంట్ పాత్రలలో కనిపించింది.

పింక్ సినిమా ఆమె కెరీర్ కు మంచి ఊపునిచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ ఆమె వరుసగా అపజయాల బాట పట్టింది. రీసెంట్ గా వచ్చిన మిథాలీ రాజ్ బయోపిక్ కూడా బెడిసి కొట్టడంతో అమ్మడం మళ్ళీ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో మరో మూడు బాలీవుడ్ సినిమాలు ఉన్నప్పటికీ కూడా తెలుగు లో కూడా చేయాలని ఆలోచిస్తుంది.

ఆమెకు రీసెంట్గా తెలుగు నుంచి రెండు ఆఫర్లు వచ్చాయట. ఇక అందులో తన డేట్స్ బట్టి ఏదో ఒక సినిమా చేసి మళ్లీ తెలుగులో బిజీ కావాలని అనుకుంటుంది. అందులో సీతార ఎంటర్టైన్మెంట్స్ నుంచి కూడా ఒక ఆఫర్ వచ్చినట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది.

మరోసారి రవితేజ తాప్సి సినిమా చేయవచ్చు అని కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇదే ఏడాది రవితేజ సితార వాళ్ళతోనే సినిమా చేసేందుకు కమిట్మెంట్ ఇచ్చాడు. బహుశా ఆ ప్రాజెక్టులో తాప్సి హీరోయిన్ గా సెలెక్ట్ కావచ్చు అని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.