Begin typing your search above and press return to search.

తెలంగాణ సెంటిమెంటుతో T- టాలీవుడ్?

By:  Tupaki Desk   |   28 Jun 2021 7:00 PM IST
తెలంగాణ సెంటిమెంటుతో T- టాలీవుడ్?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ - తెలంగాణ డివైడ్ త‌ర్వాత తెలుగు సినీప‌రిశ్ర‌మ ఏపీలోని విశాఖ‌కు షిఫ్ట‌వుతోంద‌ని ప్ర‌చార‌మైంది. ఆ క్ర‌మంలోనే తెలంగాణ టాలీవుడ్ అన్న అంశం కూడా హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణ‌లో స్థానికుల‌కు అవ‌కాశాలు క‌ల్పించ‌లేదంటూ అప్ప‌ట్లో గ‌డ‌బిడలు తెలిసిన‌దే. అయితే తెలుగు రాష్ట్రాలు రెండుగా చీలినా కానీ టాలీవుడ్ రెండుగా చీల‌లేదు. అది య‌థావిధిగానే కొన‌సాగుతోంది. ఏపీలో రాజ‌ధాని అంశం తేల‌క‌పోవ‌డం ప‌రిశ్ర‌మ‌లోనూ ర‌క‌ర‌కాల రాజ‌కీయ అడ్డంకులు విశాఖ టాలీవుడ్ కి పెద్ద ఆటంకంగా మారాయి.

కాల‌క్ర‌మంలో తెలంగాణ స్థానికుల‌కు సినీప‌రిశ్ర‌మ‌లో స‌మాన అవ‌కాశాలు అన్న టాపిక్ తెర‌వెన‌క్కి వెళ్లిపోయింది. కానీ ఇప్పుడు స‌డెన్ గా మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల్లో తెలంగాణ ప్రాతినిధ్యం హాట్ టాపిక్ గా మారింది. రేసులో ప్ర‌కాష్ రాజ్ మంచు విష్ణు వంటి ప్ర‌ముఖులు ఉన్నా కానీ వెట‌ర‌న్ నటుడు సివిఎల్ నరసింహారావు మా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతూ.. తాను తెలంగాణ కళాకారుల కోసం ప్రత్యేక ప్ర‌తినిధిగా కొన‌సాగుతాన‌ని ప్ర‌క‌టించారు. వారి హ‌క్కుల కోసం పోరాటం సాగిస్తాన‌ని మ్యానిఫెస్టోలో వెల్ల‌డించారు. పేద చిన్న క‌ళాకారులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని వారి త‌ర‌పున పోరాడ‌తాన‌ని అన్నారు. స్థానిక కళాకారులకు మద్దతు త‌న విధానం.. హీరోయిన్ కాకుండా స్థానికేత‌రులు ఇద్ద‌రిని మాత్ర‌మే తీసుకోవాల‌ని ప‌దేళ్ల క్రిత‌మే తీర్మానించినా అది అమ‌ల‌వ్వ‌డం లేద‌ని అన్నారు. నేను వ‌స్తే దానిని క‌ఠినంగా అమ‌లు చేస్తాన‌ని అన్నారు.

ఏపీ- తెలంగాణ‌ల‌కు వేర్వేరు ఎఫ్ డీసీలు ఉన్నాయి. వేర్వేరు భాషా బోర్డులు.. సినిమాటోగ్ర‌ఫీ శాఖ‌లు ఉన్నాయి. ఇప్పుడు మా అసోసియేష‌న్ కూడా రెండుగా విభ‌జించ‌బడుతుంద‌ని సీ.వీ.ఎల్ న‌ర‌సింహారావు అన్నారు. తెలంగాణ సీనియ‌ర్ క‌థానాయిక విజ‌య‌శాంతి ఆయ‌న‌కు మ‌ద్ధ‌తుగా నిలిచారు.