Begin typing your search above and press return to search.

రేప్ ఆరోప‌ణ‌.. టీసిరీస్ భూష‌ణ్ కుమార్ పై కేసు న‌మోదు

By:  Tupaki Desk   |   16 July 2021 12:30 PM GMT
రేప్ ఆరోప‌ణ‌.. టీసిరీస్ భూష‌ణ్ కుమార్ పై కేసు న‌మోదు
X
ప్ర‌ఖ్యాత టీ-సిరీస్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ భూషణ్ కుమార్ పై అత్యాచారం కేసు నమోదైంది. త‌న‌కు సినిమాల్లో అవ‌కాశం క‌ల్పిస్తానని తప్పుడు వాగ్దానం చేసి 30 ఏళ్ల మోడ‌ల్ పై అత్యాచారం చేశార‌నేది టి-సిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ పై ఆరోప‌ణ‌లు చేశారు. అంధేరి నివాసి అయిన ఫిర్యాదుదారు ఆగస్టు 2017 నుండి కుమార్ తనకు తెలుసునని త‌న‌పై 2017 - 2020 మధ్య లైంగికంగా దోపిడీ చేసిన‌ట్టు ఫిర్యాదులో పేర్కొన్నార‌ని ఒక పోలీసు అధికారి తెలిపారు.

30 ఏళ్ల మోడల్.. ఔత్సాహిక న‌టి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ పై అంధేరిలోని డిఎన్ నగర్ పోలీసులు శుక్రవారం అత్యాచారం కేసును నమోదు చేశారు. భారత శిక్షాస్మృతిలోని 376 (అత్యాచారం)- 420 (మోసం)- 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేసామని డిఎన్ నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మిలింద్ కుర్డే వెల్ల‌డించారు.

భూష‌ణ్ కుమార్ పై ఇది మొదటి కేసు కాదు. అంతకుముందు.. గుర్తు తెలియని ఓ మహిళ తనకు లైంగికంగా ఫేవ‌ర్ కావాల‌ని కోరాడ‌ని ఆరోపించింది. మూడు సినిమాల ఒప్పందం కోసం కుమార్ తనను ఒక బంగ్లాకు పిలిచాడని లైంగిక ఫేవ‌ర్ కోర‌గా తాను నిరాకరించడంతో తన కెరీర్ ను నాశనం చేస్తానని బెదిరించాడని ఆ మహిళ పేర్కొంది. కానీ అప్ప‌ట్లో భూష‌ణ్‌ కుమార్ ఈ ఆరోపణలను ఖండించారు. టీసిరీస్ ఆడియో లేబుల్ స‌హా టీసిరీస్ నిర్మాణ సంస్థ బాలీవుడ్ లో ఎంతో క్రేజు ఉన్న సంస్థ‌గా ఆవిర్భ‌వించిన సంగ‌తి తెలిసిందే.

టీ సిరీస్‌ స్థాపకుడు మధురగాయకుడైన గుల్షన్‌ కుమార్‌ పెద్ద కొడుకు అయిన భూషణ్‌ కుమార్‌ దువా ప్రస్తుతం టీ సిరీస్ కు చైర్మన్‌ కమ్‌ ఎండీగా కొనసాగుతున్నాడు. ఈయన భార్య నటి దివ్యా ఖోస్లా. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భూషణ్‌ కుమార్ వాద‌న‌ను వినాల్సి ఉంది.