Begin typing your search above and press return to search.

హాలీవుడ్‌ స్టార్‌ మాకెందుకులే

By:  Tupaki Desk   |   27 Oct 2015 7:30 PM GMT
హాలీవుడ్‌ స్టార్‌ మాకెందుకులే
X
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ సుల్తాన్. ఈ మూవీలో బాక్సింగ్ వీరుడిగా కనిపించబోతున్నాడు సల్మాన్ ఖాన్. సుల్తాన్ లో సల్లూభాయ్ కి కోచ్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వస్టర్ స్టాలోన్ ను తీసుకుంటున్నారనే వార్తలొచ్చాయి. కొన్నాళ్లుగా వీళ్లిద్దరి మధ్య ట్విట్టర్ లో మాటలు నడుస్తుండడం, ఒకరిని ఒకరు ప్రశంసించుకోవడం చేస్తున్నారు. దీంతో సల్మాన్ - స్టాలోన్ లు ఇద్దరూ కలిసి నటించనున్నారనే అంచనాలు ఎక్కువయ్యాయి.

దీనిపై సుల్తాన్ మూవీ నిర్మాత రాజా ముఖర్జీని ప్రశ్నిస్తే.. ఆయనో ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. తమ మూవీకి సల్మాన్ ఒక్కడే చాలని, ఇంకే సూపర్ స్టార్ తో తమకు అవసరం లేదన్నాడు రాణీ ముఖర్జీ సోదరుడు రాజా ముఖర్జీ. దీంతో సల్మాన్ - సిల్విస్టర్ ల కాంబినేషన్ పై రూమర్స్ కి తెరపడినట్లయింది. యాక్టర్ గా ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన భజరంగీ భాయ్ జాన్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో.. సుల్తాన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాలు సల్మాన్ ఖాన్.

అయితే.. ఇందులో సల్మాన్ కేరక్టర్ చాలా విభిన్నంగా ఉంటుందని, పలు గెటప్స్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఏజ్ కి అనుకూలంగా.. ఓ బాక్సింగ్ వీరుడి జీవిత ప్రయాణాన్ని పూర్తి స్థాయిలో చూపించబోతున్నారని, అందుకే పలు గెటప్స్ వేయాల్సి వచ్చిందని బాలీవుడ్ టాక్.