Begin typing your search above and press return to search.

సల్మాన్ ని సన్నీ చేశాడు

By:  Tupaki Desk   |   29 March 2018 5:53 AM GMT
సల్మాన్ ని సన్నీ చేశాడు
X
ప్రస్తుత రోజుల్లో చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ ఇండియన్ స్టార్స్ పై ఎదో ఒక విధంగా ప్రేమను చూపిస్తున్నారు. వారికి అమితంగా నచ్చితే హాలీవుడ్ తెరపై అవకాశాలు కూడా ఇస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ మధ్య ఓ హాలీవుడ్ సెలబ్రెటీ సల్మాన్ ఖాన్ పై ప్రేమతో సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. సినిమా సెట్స్ పైకి వెళ్లిన సందర్భంగా విషెస్ అందించాలని అనుకున్నాడు. కానీ ఆయన ప్రేమ ఎక్కువైపోవడం వల్లనో మరి ఏమైందో గాని పెద్ద పొరపాటు చేశాడు.

ఇండియాలో సల్మాన్ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు. అయితే హాలీవుడ్ స్టార్ సిల్వెస్టర్‌ స్టాలోన్‌ తన ఇన్ స్టాగ్రామ్ లో సల్మాన్ ఖాన్ రేస్ 3 మంచి విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు ఫొటో కూడా పోస్ట్ చేశాడు. కానీ అతను పోస్ట్ చేసిన ఫొటో సల్మాన్ ఖాన్ ది కాదు. సన్నీ డియోల్ ఫొటో. దీంతో ఆ పోస్ట్ కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. స్క్రీన్ షాట్స్ తీసి నెటీజన్స్ ట్రాల్స్ వేయడం ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో ఎవరిని ఆ స్థాయిలో కామెంట్స్ చేయని విదంగా సిల్వెస్టర్‌ స్టాలోన్‌ పై బాలీవుడ్ అభిమానులు కామెంట్ చేశారు.

ఇక సిల్వెస్టర్‌ తన పొరపాటును తెలుసుకొని వెంటనే ఫొటో మార్చేశాడు. రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. స్టైలిష్ దర్శకుడు రెమో డిసౌజా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కథానాయిక నటిస్తుండగా అనిల్‌ కపూర్‌ - డైసీ షా ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించనున్నారు.