Begin typing your search above and press return to search.

సైరా సీమ పల్లెకు పదరా

By:  Tupaki Desk   |   2 Jan 2019 6:09 AM GMT
సైరా సీమ పల్లెకు పదరా
X
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో 151వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ మధ్య మధ్య గ్యాప్స్ వస్తున్నా రెగ్యులర్ గా కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య జార్జియాలో కీలకమైన యుద్ధ సన్నివేశాలను పూర్తి చేసుకున్న సైరా టీమ్ ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలో కొంత పార్ట్ షూట్ చేసుకుంది. తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డి కొత్త షెడ్యూల్ కి రంగం సిద్ధం చేస్తున్నాడు.

రామోజీ ఫిలిం సిటీలో రాయలసీమ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉండే ఓ సహజమైన పల్లెటూరి సెట్ ని ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇందులో ఎప్పటి నుంచి చిత్రీకరణ ఉంటుందన్న సమాచారం పక్కాగా లేదు కానీ మరికొద్ది రోజుల్లోనే అని టాక్, ఇందులో అందరు ఆరిస్టులు పాల్గొంటారని సమాచారం. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కాంబోలో వచ్చే సన్నివేశాలు ఇందులోనే పూర్తి చేయబోతున్నట్టు తెలిసింది. ఆయన ఆరోగ్య రిత్యా సంక్రాంతి అయ్యాక చలి తగ్గుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఆ సమయంలోనే ప్లాన్ చేసినట్టుగా వినికిడి.

ఇందులోనే నయనతార-విజయ్ సేతుపతి-కిచ్చ సుదీప్-జగపతి బాబు తదితర మల్టీ స్టారర్స్ అందరూ పాల్గొనబోతున్నారు. నరసింహరెడ్డి గూడెంలో జరిగే కొన్ని కీలకమైన సంఘటనలు నేపధ్యంగా ఈ షెడ్యూల్ ఉంటుందట. ఓ గ్రూప్ సాంగ్ తీసే ఆలోచన కూడా జరుగుతోందట. అమిత్ త్రివేది ప్రస్తుతం దాని కంపోజింగ్ లోనే బిజీగా ఉన్నట్టు సమాచారం.