Begin typing your search above and press return to search.

సైరా టీం సై అనలేదింకా

By:  Tupaki Desk   |   23 Sept 2017 10:39 AM IST
సైరా టీం సై అనలేదింకా
X
మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాకి రెడీ అయిపోయారు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. సైరా నరసింహారెడ్డి అనే టైటిల్ పై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లైఫ్ ను సినిమాగా తీయబోతున్నారు. టీం గురించిన వివరాలు కూడా వచ్చేశాయి. అయినా సరే.. మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే అంశాన్ని మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు.

ఇందుకు సైరా టీం ఆలోచనా తీరే ప్రధాన కారణంగా తెలుస్తోంది. చకచకా ఫినిష్ చేసేయాలనే ఆలోచన.. మెగా151 యూనిట్ లో ఎవరికీ లేదట. ఇలాంటి మూవీని తెరకెక్కించే అవకాశం జీవితంలో ఒకసారే వస్తుందనే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రానికి ఎంపిక చేసిన క్యాస్టింగ్.. సెలెక్ట్ చేసిన టెక్నీషియన్స్.. రూపుదిద్దుకుంటున్న సెట్టింగ్స్.. విజువల్ ఎఫెక్ట్స్ ప్లానింగ్.. ఇవన్నీ చూస్తుంటే బడ్జెట్ పై హద్దులు అనే మాట ఎక్కడా పెట్టుకోలేదని సంగతి అర్ధమవుతూనే ఉంది. ప్రస్తుతం హైద్రాబాద్ లోనే మూడు చోట్ల సెట్స్ రూపుదిద్దుకుంటున్నాయి. నానక్ రాం గూడలో ఒకటి.. అల్యూమినియం ఫ్యాక్టరీ మరొకటి.. ఫిలింసిటీలో వేరొక భారీ సెట్స్ ను నిర్మిస్తున్నారట. వీటితో పాటు ఫారిన్ లోనూ సెట్స్ వేసి షూటింగ్ చేయనున్నారు. ఇక పొలాచ్చి షూట్ ప్లానింగ్ కూడా ఉంది.

గ్రాఫిక్స్ టీంకు కన్వీనియెన్స్ కోసం.. ఒకేసారి మూడు నాలుగు ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందట. అందుకు తగ్గట్లుగానే మొత్తం ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. అందుకనే దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఏమాత్రం తొందరపడ్డం లేదని అంటున్నారు. మెగాస్టార్ కూడా టీం మెంబర్స్ ను త్వరపెట్టడం లేదని.. కావలసినంత టైం తీసుకుని.. పర్ఫెక్ట్ ఔట్ పుట్ ఇవ్వాలని చెబుతున్నారని తెలుస్తోంది.