Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ కు సైరా కష్టాలు

By:  Tupaki Desk   |   10 April 2019 6:53 AM GMT
ఆర్ ఆర్ ఆర్ కు సైరా కష్టాలు
X
అదేంటి రాజమౌళి సినిమాకు మెగాస్టార్ మూవీకి లింక్ ఏంటి అని ఆశ్చర్యపోకండి. అసలు మ్యాటర్ వేరే ఉంది. టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ కు ఆదిలోనే హంసపాదు అన్నట్టు చీలమండకు గాయమై చరణ్ మూడు వారాలు రెస్ట్ లో ఉన్న సంగతి తెలిసిందే. దెబ్బకు జూనియర్ ఎన్టీఆర్ కూడా హైదరాబాద్ వచ్చేసి లీజర్ టైంని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అసలు చిక్కు ఇక్కడే వచ్చింది.

అహ్మదాబాద్ పూణే షెడ్యూల్స్ లోనే జాయిన్ అయ్యేలా అలియా భట్ పార్ట్ ని ప్లాన్ చేశాడు రాజమౌళి. ఆ మేరకు డేట్స్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు చరణ్ గాయంతో అవి కాస్తా వృధా అయిపోయాయి. పోనీ తర్వాత తీసుకుందాం అంటే అలియా భట్ ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరొయిన్. అంత ఈజీగా కాల్ షీట్స్ పదే పదే ఇచ్చేంత సీన్ లేదు. మేలో కంటిన్యూ చేయలన్నా ఈ ఇబ్బందిని అధిగమించే బాధ్యత రాజమౌళిపై పడింది. మరోవైపు తారక్ జోడిని సెట్ చేయడం ఇంకో ప్రెజర్

ఇప్పుడు సైరాకు దీనికి కనెక్షన్ విషయానికి వద్దాం. అచ్చం ఇదే తరహాలో సైరా సైతం ఇప్పటి దాకా ఎన్నో గ్యాపులు బ్రేకులు వేసుకుంటూ ఆలస్యమవుతూ వచ్చింది. చిరు సరసన నయనతారను సెట్ చేయడానికే నెలలు పట్టింది. తమన్నా అంత సులువుగా ఒప్పుకోలేదు. చిరు అప్పుడప్పుడు కాస్త బడలిక వల్ల అనారోగ్యం పాలవడం షూటింగ్ కి ఎఫెక్ట్ ఇచ్చింది.

సుదీప్ విజయ్ సేతుపతి అమితాబ్ లాంటి ఇతర బాషా స్టార్లు ఉండటంతో వీళ్ళు ఉన్న కాంబో సీన్లను తీసేందుకు చాలా సార్లు ఏవేవో కారణాలు అడ్డుగా వచ్చి అనుకున్న సమయానికి పూర్తి చేయకుండా నిలిచాయి. ఇవన్ని దాటుకుని వచ్చేలోపే రెండేళ్ళు దాటేసింది. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కు ఇలాంటి సమస్యలే వస్తున్నాయి కాబట్టి సైరాతో ఆ రకంగా పోలిక వచ్చిందన్న మాట