Begin typing your search above and press return to search.

సైరా రిలీజ్ కి ఒడిస్సాలో చిక్కులు

By:  Tupaki Desk   |   1 Oct 2019 10:47 AM GMT
సైరా రిలీజ్ కి ఒడిస్సాలో చిక్కులు
X
విడుద‌ల ముందు సైరా న‌ర‌సింహారెడ్డి వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఈ సినిమా రిలీజ్ ని ఆపాలంటూ రాయ‌ల‌సీమ నుంచి రాజ‌కీయ‌ బ‌ల‌గాలు కోర్టులో కేసు వేసిన సంగ‌తి తెలిసిందే. నిర్మాత కేతిరెడ్డి సైతం తెలంగాణ హైకోర్టులో కేసు వేయ‌డంతో దానిపై విచార‌ణ సాగింది. ఉయ్యాల‌వాడ క‌థ విష‌యంలో ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల డిబేట్ల‌లో ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు ర‌క‌ర‌కాలుగా ఆరోపించారు. ఇందులో జెన్యూనిటీ లేద‌ని ఫిక్ష‌న్ క‌థ ఇద‌ని ఆరోపించారు.

అయితే సైరా టీమ్ మాత్రం వేరొక‌లా చెబుతోంది. ఇదో దేశ‌భ‌క్తుడి క‌థ అని చ‌రిత్ర చెబుతోంది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తొలి విప్లవానికి తెరలేపిన వీరాధివీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని.. కానీ ఆయన చరిత్ర బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియదని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప‌లుమార్లు వాదించారు. 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తొలి విప్లవానికి తెర తీసార‌ని చెబుతూ సైరా చిత్రాన్ని తెర‌కెక్కించారు. మ‌రికొన్ని గంట‌ల్లో రిలీజ్ కి రెడీ అవుతుండ‌గా మ‌రో వివాదం పెను స‌మ‌స్య‌గా మారింది.

ఉయ్యాల‌వాడ తొలి విప్ల‌వ వీరుడు కాద‌ని.. సైరా టీమ్ చెప్పేది నిజం కాద‌ని.. ఒడిస్సాకు చెందిన కళింగసేన రాజ‌కీయ‌ పార్టీ ఎదురుదాడికి దిగింది. వాస్తవానికి 200 ఏళ్ల కిందటే 1817లో ఒడిశాలో తొలి స్వాతంత్య్ర పోరాటం జరిగిందన్న‌ది వారి వాద‌న‌. ఈ మేరకు భువనేశ్వర్‌లో సైరా సినిమాను ప్రదర్శించనున్న శ్రీయ థియేటర్‌ వద్ద నిరసన తెలిపారు. అక్క‌డ థియేట‌ర్ ముందు అమితాబ్- చిరు పోస్ట‌ర్ల‌ను ధ‌గ్ధం చేశారు. ఖుర్దా ప్రాంతం ప్రజలు పయికొ విప్లవం పేరిట ఆంగ్లేయుల‌పై తొలి పోరాటం చేశారని వీరు నివేదిస్తున్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా పయికొ దేశంలో తొలి విప్లవమేన‌ని ప్రకటించారు. త‌ప్పుగా చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించారు. సైరాను ఒడిస్సాలో రిలీజ్ కానివ్వం అంటూ హుకుం జారీ చేశారు. ఒక స‌మ‌స్య‌కు కోర్టు తీర్పు పాజిటివ్ గా రాగానే మ‌రో స‌మ‌స్య ఎదుర‌వుతోంది.