Begin typing your search above and press return to search.

'సైరా' బ్రేక్‌ ఈవెన్‌ కు ఎంత దూరం?

By:  Tupaki Desk   |   19 Oct 2019 1:44 PM GMT
సైరా బ్రేక్‌ ఈవెన్‌ కు ఎంత దూరం?
X
మెగా మూవీ 'సైరా నరసింహారెడ్డి' చిత్రం భారీ అంచనాల నడుమ దాదాపుగా 300 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన విషయం తెల్సిందే. ఈ చిత్రం తెలుగు.. తమిళం.. హిందీ.. మలయాళం.. కన్నడ భాషల్లో కలిపి అన్ని ఏరియాల్లో ఏకంగా 200 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 115 కోట్లకు అమ్ముడు పోయింది. ఇతర భాషలు మరియు ఇతర ప్రాంతాలతో కలిపి 200 కోట్ల బిజినెస్‌ చేసిన ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ కు కష్టాలు పడుతోంది.

సైరా సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా అది కలెక్షన్స్‌ గా మారలేదు. నెగటివ్‌ టాక్‌ వచ్చిన సాహో చిత్రం స్థాయిలో ఈ చిత్రం వసూళ్లను రాబట్టలేక పోతుంది. చిరంజీవి స్టామినాతో ఈజీగా బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని బయ్యర్లు భావించారు. కాని తెలుగు రాష్ట్రాల్లో మినహా ఇతర ప్రాంతాలన్నింటిలో కూడా బ్రేక్‌ ఈవెన్‌ కు ఆమడ దూరంలో కలెక్షన్స్‌ ఉన్నాయి. ముఖ్యంగా హిందీ వర్షన్‌ పరిస్థితి దారుణంగా ఉంది. హిందీలో విడుదలైన 17 రోజుల్లో కేవలం 5.6 కోట్లను మాత్రమే వసూళ్లు చేయగలిగింది. కర్ణాటకలో 14 కోట్లు.. తమిళనాడులో 1.4 కోట్లు.. కేరళలో 75 లక్షలు వసూళ్లు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా 17 రోజుల్లో రూ. 140 కోట్ల రూపాయలను వసూళ్లు చేసింది. మరో 10 కోట్ల వరకు ఈ చిత్రం రాబట్టే అవకాశం ఉంది. అంటే ఈ చిత్రం ఓవరాల్‌ గా 50 కోట్ల నష్టంను బయ్యర్లకు మిగల్చబోతుంది. బ్రేక్‌ ఈవెన్‌ కు 60 కోట్ల దూరంలో ఉన్న సైరా చిత్రం మరో 10 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తుందని ఆపై అంతా నష్టమే అంటున్నారు.

తెలంగాణలో వరుసగా వచ్చిన సెలవులు మరియు ఏపీలో దసరా సెలవుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు అయితే నమోదు అయ్యాయి. కాని ఇతర ప్రాంతాల్లో దారుణమైన కలెక్షన్స్‌ నమోదు అయ్యాయి. ఓవర్సీస్‌ లో కూడా ఈ చిత్రం మెగా స్థాయిలో ఆడలేదు. భారీ బడ్జెట్‌ అవ్వడం వల్ల నష్టాలు మరీ ఎక్కువగా ఉన్నాయని.. 150 నుండి 200 కోట్ల వరకు పెట్టి నిర్మించి ఉంటే బాగుండేదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.