Begin typing your search above and press return to search.

నేటి బిగ్ బాస్ ఎలిమినేటర్ శ్యామ‌ల‌...వైర‌ల్!

By:  Tupaki Desk   |   8 July 2018 7:42 AM GMT
నేటి బిగ్ బాస్ ఎలిమినేటర్ శ్యామ‌ల‌...వైర‌ల్!
X
బిగ్ బాస్ -1తో పోలిస్తే బిగ్ బాస్ -2కు ఆద‌ర‌ణ త‌క్కువ‌గా వ‌స్తోంద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అయితే, వీకెండ్స్ లో నాని త‌న చరిష్మాతో కొద్దో గొప్పో హైప్ తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే నిన్న షోలో బాబు గోగినేనికి షాకిచ్చాడు నాని. అయితే, ఈ రోజు ఎలిమినేష‌న్ రౌండ్ ఉండ‌డంతో అంతా ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆ సస్పెన్స్ కు తెర దించుతూ తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. నేటి షోలో యాంక‌ర్ శ్యామ‌ల ఎలిమినేట్ కాబోతోందన్న‌ది ఆ పోస్ట్ సారాంశం. అయితే, శ్యామ‌లే స్వ‌యంగా ఆ విష‌యాన్ని త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయ‌డం ఇపుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇంకా హౌస్ లో నే ఉన్న శ్యామ‌ల ఎఫ్ బీలో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డంతో....ఈ షో లైవ్ కాద‌ని కామెంట్స్ వ‌స్తున్నాయి.

ఈ సీజ‌న్ తొలి వారంలో సంజన, రెండో వారంలో నూతన్ నాయుడు, మూడో వారంలో కిరీటి దామరాజు ఎలిమినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. నాలుగో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అని అంతా ఆస‌క్తిగా ఉన్నారు. తేజ‌స్వి మ‌దివాడ...బయటకు వెళ్ల‌బోతోంద‌ని అంతా అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఈ వారం యాంకర్ శ్యామల ఎలిమినేట్ కాబోతోంద‌ని సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ``నాకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశా. ఇషాన్ తో ఆడుకుంటున్నాను`` అని యాంకర్ శ్యామ‌ల ఫేస్ బుక్ పేజీలో పెట్టిన ఓ పోస్ట్ వైర‌ల్ అయింది. అయితే, ఆ వెంట‌నే ఆ పోస్ట్ డిలీట్ అయింది. అయితే, అప్ప‌టికే చాలామంది స్క్రీన్ షాట్స్ తీసుకోవ‌డంతో ఈ పోస్ట్ వైర‌ల్ అయింది. అయితే, ఈ విష‌యం బిగ్ బాస్ కు తెలియ‌డంతో.....శ్యామల ఆ పోస్ట్ డిలీట్ చేసింద‌ని టాక్. లేదంటే శ్యామ‌ల ఎఫ్ బీ ఖాతాను ఎవ‌ర‌న్నా హ్యాక్ చేశారో వేచి చూడాలి. అస‌లు శ్యామ‌ల ఎలిమినేష‌న్ నిజ‌మా...ఆ పోస్ట్ ఎవ‌రు పెట్టారు...బిగ్ బాస్ లైవ్ కాదా....అన్న విష‌యాలు తెలియాలంటే రాత్రి వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.