Begin typing your search above and press return to search.
శ్రీదేవికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం అరుదైన గౌరవం
By: Tupaki Desk | 9 Sep 2018 12:22 PM GMTఅతిలోక సుందరి శ్రీదేవి మరణంను ఆమె అభిమానులు ఇంకా కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ సంవత్సరం ఆరంభంలో దుబాయిలో ఒక వివాహ వేడుకలో హాజరు అయ్యేందుకు వెళ్లిన శ్రీదేవి హోటల్ లో ప్రమాదవశాత్తు మృతిచెందిన విషయం తెల్సిందే. శ్రీదేవి మరణం బాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమాకే తీరని లోటు అంటూ సినీ వర్గాల వారు మరియు ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవిపై అభిమానం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల వారు కూడా కనబర్చుతూ వస్తున్నారు. తాజాగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం వారు శ్రీదేవికి అరుదైన గౌరవంను కట్టబెట్టేందుకు సిద్దం అయ్యారు.
స్విట్జర్లాండ్ పర్యటక దేశంగా బాగా ప్రాచుర్యం పొందిన విషయం తెల్సిందే. కారణం అక్కడ ఎన్నో చిత్రాల చిత్రీకరణ జరుపుకున్నాయి. అక్కడ షూటింగ్స్ నిర్వహించడం వల్ల ఆ దేశపు అందాలు ప్రపంచానికి తెలిశాయి. స్విట్జర్లాండ్ నేపథ్యంలో ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించిన యశ్ చోప్రాపై అక్కడి ప్రభుత్వం తమ గౌరవంను కనబర్చాయి. 2016వ సంవత్సరంలో ఆయన విగ్రహంను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
తాజాగా శ్రీదేవి విగ్రహంను కూడా స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహకాలు మొదలు పెట్టింది. శ్రీదేవి పలు చిత్రాల షూటింగ్ ల కోసం స్విట్జర్లాండ్ వచ్చారని - ఆమె తమ దేశంకు టూరిస్టులు పెరగడంలో దోహదపడ్డారు అంటూ వారు భావిస్తున్నారు. అందుకే శ్రీదేవి విగ్రహంను ఏర్పాటు చేసి - దాన్ని టూరిస్టు ప్లేస్ గా మార్చాలని అక్కడి ప్రభుత్వ వర్గాల వారు భావిస్తున్నారట. శ్రీదేవికి అక్కడ విగ్రహం పెట్టబోతుండటం చాలా పెద్ద గౌరవంగా కుటుంబ సభ్యులు మరియు అభిమానులు భావిస్తున్నారు.