Begin typing your search above and press return to search.

​​మన విలన్ ప్రేమకథ విందాం రారండి

By:  Tupaki Desk   |   3 July 2017 7:33 AM GMT
​​మన విలన్ ప్రేమకథ విందాం రారండి
X
తెలుగులో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటున్న అజయ్.. ఇప్పుడు ఆయన భార్య శ్వేత రావూరి కారణంగా న్యూస్ లో ఉంటున్నాడు. పెళ్లి అయ్యి ఇద్దరి పిల్లల తల్లిగా ఉంటూనే ఫ్యాషన్ డిజైనర్గా ఇప్పూడు మిసెస్ ఇండియా పోటీలో ఫైనల్ పోటీదారిణిగా నిలిచింది ఈమె. అయితే సినిమాలకు ఎటువంటి సంబంధం లేకపోయాన అజయ్ ప్రేమ వలన ఆమె జీవితం చాలానే మలుపులు తిరిగిందట. ఏమి ఎరగని పడుచు పిల్ల నుండి ప్రేమికురాలుగా, కోడలిగా, తల్లిగా ఇప్పుడు మిసెస్ ఇండియా పోటీలో పాల్గొని చాలా మందికి ప్రేరణ గా నిలిచింది. అజయ్ శ్వేతల పెళ్లి పెద్దలు కుదిర్చినది కాదు వీళ్ళకు ఒక సినిమా కథ లాంటి ప్రేమ కథ ఉంది తెలుసా!!

శ్వేత తన ప్రేమ గురించి అజయ్ నిజాయితీ గురించి ఆమె మాటలులోనే.. “నేను ఇక్కడే హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. నాకు మా ఇల్లు నా ఫ్రెండ్స్ తప్పితే వేరే ప్రపంచం తెలియదు. సినిమాలు కూడా తక్కువే చూసేదాన్ని. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అప్పుడుప్పుడు వచ్చి మాట్లాడ్డానికి ప్రయత్నాలు చేసేవాడు. కొన్నాళ్ళకు అతని నిజాయితీ నచ్చి స్నేహం చేశాను ఆ కుర్రాడే మీరు మెచ్చిన అజయ్'' అని చెప్పింది. ''ఇంకా అక్కడ నుండి అతను నా కాలేజీ వరకు వచ్చి నన్ను దింపటం మళ్ళీ కాలేజీ తర్వాత తోడు రావటం చేసేవాడు. ఇలా కొన్నాళ్ళకు వాళ్ళ ఇంటిలో ఫ్రెండ్ గా పరిచయం చేశాడు. నేను కూడా మా అమ్మకు చెప్పాను నా ప్రేమ గురించి. అంతా వరకు అన్నీ ఇంటిలో వాళ్ళు చెప్పినట్లు చేసిన నేను ఒక్కసారి ఇలాంటి విషయం చెప్పేసరికి బాగానే కోపగించుకున్నారు. అజయ్ నేను కలిసి మా పెద్దవాళ్లను ఒప్పించి మాటలాడించి పెళ్లి జరిగేపాటికి ఒక పెద్ద తతంగమే నడిచింది లెండి'' అంటోంది శ్వేత.

''నేను డిగ్రీ పూర్తి చేసి అజయ్ ని పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత అజయ్ సపోర్ట్ తో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను ఇప్పుడు తన సపోర్ట్ తో మిసెస్ ఇండియా పోటీలో పాల్గొన్నాను'' అని చెబుతూ ఏది ఏమైనా నన్ను పెళ్లి చేసుకున్నాకే అజయ్ కి మంచి అవకాశాలు వచ్చాయి తెలుసా అని గారాలు పోతుంది కూడా శ్వేత రావూరి. విక్రమార్కుడులో విలన్ గా.. తరువాత ఇష్క్ లో అన్నయ్యగా.. జనతా గ్యారేజ్ లో గ్రూపు మెంబర్ గా.. కాటమరాయుడులో తమ్ముడిగా.. ఇలా పెద్ద పెద్ద సినిమాలలో బిజీ ఆర్టిస్ట్ గా అజయ్ కెరియర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/