Begin typing your search above and press return to search.

సెక్స్ రాకెట్ ఇష్యూపై శ్వేతా బసు...

By:  Tupaki Desk   |   23 Sept 2016 10:02 AM IST
సెక్స్ రాకెట్ ఇష్యూపై శ్వేతా బసు...
X
మక్దీ - ఇక్బాల్ లాంటి సినిమాల ద్వారా హిందీలో బాల నటిగా కెరీర్ ప్రారంభించి - జాతీయ పురష్కారం అందుకుని, అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో మెరుపులు మెరిపించిన శ్వేతాబసు ప్రసాద్ గురించి తెలియని వారుండరేమో! "కొత్త బంగారు లోకం" తో తెలుగు తెరకు పరిచయమై "ఎకడా..." అంటూ తెలుగువారికి దగ్గరైన శ్వేత - తర్వాతి 2014లో ఒక వ్యభిచార కేసులో ఇరుక్కోవడం అప్పట్లో అప్పట్లో సంచలనం అయ్యింది. అయితే ప్రస్తుతం బుల్లితెరపై నటిస్తున్న శ్వేత.. నాటి సెక్స్ రాకెట్ - అనంతరం తనపై చూపిస్తున్న సానుభూతి పై స్పందించారు.

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న శ్వేతా బసు ప్రసాద్.. హిందీ బుల్లితెర పరిశ్రమలో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం చంద్ర నందిని అనే హిందీ టీవీ సీరీస్ లో నందిని అనే యువరాణి పాత్రలో శ్వేతా బసు కనిపించనుంది. ఈ సీరియల్ ప్రమోషన్ లో పాల్గొన్న ఆమెపై మీడియా నుంచి గత సంఘటనకు సంబందించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సమయంలో ఆ ప్రశ్నలపై స్పందించిన శ్వేత బసు... ఆ విషయాలపై మాట్లాడటానికి నిరాకరిస్తూనే - తనకు ఎలాంటి సానుభూతి అవసరం లేదని అన్నారు. నాడు జరిగిన సంఘటన విషయంలో తనపై ఎలాంటి సానుభూతి చూపించవద్దని, ప్రస్తుతం కెరీర్ పై మాత్రమే తాను దృష్టి పెట్టానని చెప్పింది శ్వేతా బసు ప్రసాద్.

కాగా... ఏక్తాకపూర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న ఈ చంద్రనందిని సీరియల్ లో జోధా అక్బర్ ఫేమ్ రజత్ తోకాస్ కీలకమైన పాత్ర చేస్తుండగా... శ్వేతా బసు కీ రోల్ ప్లే చేస్తుంది! మౌర్య సామ్రాజ్యాన్ని స్దాపించిన రాజా చంద్రగుప్తుని కథతో ఈ సీరియల్ సాగుతుందని.. ఈ సీరియల్ లో శ్వేతాబసుది కీ రోల్ అని తెలుస్తోంది. ఈ సీరియల్ తనకు లైఫ్ ఇస్తుందనే నమ్మకంతో శ్వేతాబసు ఉంది.