Begin typing your search above and press return to search.
‘కొత్త బంగారం లోకం’ హీరోయిన్ ఇలా అయ్యిందేమిటి?
By: Tupaki Desk | 11 May 2020 3:00 PM ISTశ్వేతబసు ప్రసాద్.. ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో అందం.. అభినయంతో ‘ఎక్కా....డ’ అనే డైలాగ్ విసిరి కుర్రకారు మదిని దోచింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఖచ్చితంగా శ్వేతబసు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ మనమొకటి తలిస్తే కాలమొకటి తలిచింది. ఆ తర్వాత శ్వేత చేసిన సినిమాలన్నీ బెడిసికొట్టాయి. ఆమె ఎంచుకున్న సినిమాలు ఫ్లాప్స్ కావడంతో ఆమె కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఎందుకో ఈ బ్యూటీ ఎక్కువకాలం ఇండస్ట్రీలో నిలవలేకపోయింది.
ఇక సినిమాల ఫ్లాప్ తో ఆమె వ్యక్తిగత జీవితం కూడా గాడితప్పింది. ఆమె కొన్ని కార్యకలపాల్లో దొరికిందనే రూమర్స్ వచ్చాయి. ఇక 2018లో రోహిత్ మిట్టల్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకొని కొద్దికాలానికే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. పెళ్లి చేసుకోవడం తప్పని అప్పట్లో చెప్పుకొచ్చింది.
అప్పటి నుంచి తెరమరుగైన శ్వేత బసు ప్రసాద్.. తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలు తాజాగా షేర్ చేసింది. అందులో ఆమె ముఖం వాడిపోయి బక్కపలుచగా.. అస్సలు జీవంలేకుండా కనిపించింది. చూస్తుంటే ఆమె కొంతకాలంగా డిప్రెషన్ లో ఉండిపోయిందని అనిపిస్తోంది.
ఓవైపు సినిమా చాన్సులు లేవనే బాధ.. మరోవైపు భర్తతో విడాకులు శ్వేతబసును తీవ్ర మనోవేధనకు గురిచేశాయని సమాచారం. ప్రస్తుతం శ్వేతబసును చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అప్పటి హీరోయిన్ ఇమేనా అని ఆశ్చర్యపోతున్నారు.