Begin typing your search above and press return to search.

యుద్ద భూమిలో బాహుబ‌లిలా నిఖిల్!

By:  Tupaki Desk   |   1 Jun 2023 7:42 PM GMT
యుద్ద భూమిలో బాహుబ‌లిలా నిఖిల్!
X
పాన్ ఇండియా స‌క్సెస్ 'కార్తికేయ‌-2' త‌ర్వాత నిఖిల్ ప్లానింగ్ ఎంత ప‌క్కాగా ఉందో? అత‌డి అప్ డేట్స్ ని బ‌ట్టే తెలుస్తుంది. 'ది ఇండియా హౌస్'..'స్వ‌యంభు'..'కార్తికేయ‌-3' లాంటి సినిమాలు పాన్ ఇండియాలో ప్లాన్ చేయ‌డం అంత‌కంత‌కు అంచ‌నాలు పెంచేస్తుంది. స్టోరీ ప‌ట్ల నిఖిల్ ఎంత ప్లానింగ్ తో ఉంటాడో? అత‌ని స‌క్సెస్ లే చెబుతున్నాయి. కేవ‌లం ఇన్నోవేటివ్ సినిమాల‌తో ఈ త‌ర‌హాలో ఫేమ‌స్ అవ్వ‌డం నిఖిల్ కి మాత్ర‌మే చెల్లింది.

తాజాగా 'స్వ‌యంభు' ప్రీ లుక్ లుక్ పోస్ట‌ర్ తో ఏకంగా హాలీవుడ్ హీరోల్నే త‌ల‌పిస్తున్నాడు. యద్ధ భూమిలో క‌త్తి దూసిన వీరుడి అవ‌తారంలో నిఖిల్ ఒక్క నిమిషం పాటు నిశ‌బ్ధం వ‌హించేలా చేసాడు. నేడు నిఖిల్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుక‌ని 'స్వ‌యంభు' టైటిల్ తోపాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని మేక‌ర్స్ అధికారికంగా కొద్ది సేప‌టి క్రిత‌మే రిలీజ్ చేసారు. పోస్ట‌ర్ ఆద్యంతం సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది.

యుద్ద భూమిలో శ‌త్రువుల‌పై విరోచిత పోరాటం క‌నిపిస్తుంది. నిఖిల్ ఆహార్యం ఆద్యంతం వీరుడ్ని త‌ల‌పిస్తుంది. పోడ‌వైన జుట్టు.. చేతిలో బ‌ల‌మైన బ‌ల్లెం..మ‌రో చేతిలో డాలు...ఒంటికి ర‌క్ష‌క క‌వ‌చం ప్ర‌తీది నిఖిల్ ని ఓ వీరుడిలా హైలైట్ చేసారు.

నిఖిల్ మేకోవ‌ర్ అద్భుతం అనేలా ఉంది. స్వ‌యంభు నిఖిల్ కెరీర్ లోనే భారీ బ‌డ్జెట్ చిత్రంలో క‌నిపిస్తుంది. భారీ వార్ నేప‌థ్యంలో సాగే పిరియాడిక్ స్టోరీ ఇది. బాహుబ‌లి త‌ర‌హాలో భారీ యుద్ద స‌న్నివేశాలతో ముడిప‌డిన క‌థ‌లా క‌నిపిస్తుంది.

ఆగ‌స్టు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వ‌హిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్ శ్రీకర్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్ప‌కుడిగా ఉన్నారు. నిఖిల్ కిది 20వ సినిమా కావ‌డం విశేషం.

అత్యాధునిక సాంకేతిక ప్ర‌మాణ‌ల‌తో చిత్రం తెర‌కెక్కుతుంది. ఈసినిమాకి కేజీఎఫ్ సంగీత ద‌ర్శ‌కుడు ర‌వి బ‌స్రూర్ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు.