Begin typing your search above and press return to search.

ఆ సినిమాతో పోలీసు కేసులో ఇరుక్కున్న స్వాతి నాయుడు

By:  Tupaki Desk   |   26 Dec 2020 2:00 PM IST
ఆ సినిమాతో పోలీసు కేసులో ఇరుక్కున్న స్వాతి నాయుడు
X
యూట్యూబ్‌ ప్రేక్షకులకు స్వాతి నాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె చేసిన సినిమాలు వీడియోలు యూట్యూబ్‌ లో సెన్షేషన్‌ క్రియేట్‌ చేశాయి. ఆమె వ్యక్తిగత జీవితం కూడా చాలా సంచలనం అనడంలో సందేహం లేదు. ఎన్నో రకాలుగా మీడియాలో ఉంటూ వస్తున్న స్వాతి నాయుడు ఈసారి ఒక పోలీసు కేసుతో వార్తల్లో నిలిచింది. మూడు సంవత్సరాల క్రితం స్వాతి నాయుడు 'నేనే దేవుడ్ని' అనే సినిమాను చేసింది. ఆ సినిమా యూట్యూబ్‌ ద్వారా విడుదల అయ్యింది. ఆ సినిమా విషయమై తనను పోలీసులు వేదిస్తున్నారు అంటూ స్వాతి నాయుడు తాజా వీడియోలో పేర్కొంది.

గత కొన్ని రోజులుగా కొందరు పోలీసులు నాకు పదే పదే కాల్‌ చేసి మీరు నటించిన సినిమాపై కేసు నమోదు అయ్యింది. మీరు ఒక సారి విచారణకు స్టేషన్‌ కు రావాల్సి ఉంటుంది అంటూ పిలుస్తున్నారు. ఆ సినిమాలో చాలా మంది నటించారు. ఆ సినిమా తీసింది.. తీయించింది వేరే వారు. అయినా నన్ను ఎందుకు మీరు ఈ కేసులోకి లాగుతున్నారు అంటూ స్వాతి నాయుడు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు నన్ను వేదిస్తున్నారని.. ఆ సినిమా అంతటికి కారణం అయిన కరుణాకర్‌ సుగుణ లను మాత్రం ఏం చేయలేక పోతున్నాను. వారిని వదిలేసి సినిమాలో చిన్న పాత్రను చేసిన నన్ను ఎందుకు విచారణకు ఆహ్వానిస్తున్నారు అంది. నాతో పాటు చాలా మంది ఆ సినిమాలో నటించారు. వారందరిని కూడా మీరు విచారించార అంటూ పోలీసులను ప్రశ్నించింది. స్వాతి నాయుడు ఈ కేసులో కాస్త డెప్త్‌ గానే ఇరుక్కుందని ఆమె ముందు ముందు ఏం మాట్లాడబోతుందా అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది.