Begin typing your search above and press return to search.

అనుష్క టీమ్‌ని భ‌య‌పెడుతున్న'స్వాతిముత్యం'?

By:  Tupaki Desk   |   8 Oct 2022 8:29 AM GMT
అనుష్క టీమ్‌ని భ‌య‌పెడుతున్నస్వాతిముత్యం?
X
బెల్లంకొండ గ‌ణేష్ న‌టించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ 'స్వాతిముత్యం'. సీతార ఎంట‌న్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ ల‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. రీసెంట్ గా ద‌స‌రా సంద‌ర్భంగా రిలీజైన ఈ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేక్ష‌కుల అభినంద‌న‌ల్ని సొంతం చేసుకుని మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. వీర్య దాసం, స‌రోగ‌సీ వంటి కాన్సెప్ట్ నేప‌థ్యంలో ఎలాంటి అస‌భ్య‌క‌ర స‌న్నివేశాలకు తావు లేకుండా క్లీన్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన సినిమా ఇది.

తెలుగు ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ఈ మూవీ ఇప్పుడు అనుష్క టీమ్ ని భ‌య‌పెడుతోంద‌ట‌. వివ‌రాల్లోకి వెళితే.. 'నిశ్శ‌బ్దం' త‌రువాత అనుష్క కొంత విరామం తీసుకుని యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టితో క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

యువీ క్రియేష‌న్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ గ‌త కొన్ని నెల‌లుగా సైలెంట్ గా జ‌రుగుతోంది. అయితే ఈ మూవీ టీమ్ బెల్లంకొండ గ‌ణేష్ న‌టించిన 'స్వాతిముత్యం' మూవీని చూసి ఇప్ప‌డు టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌.

కార‌ణం 'స్వాతిముత్యం' స‌రోగ‌సీ, వీర్య‌దానం అనే పాయింట్ తో తెర‌కెక్కితే అనుష్క‌, న‌వీన్ పొలిశెట్టి ల మూవీ కూడా అదే త‌ర‌హా పాయింట్ తో రూపొందుతుండ‌ట‌మే ఇప్ప‌డు ఇబ్బందిక‌రంగా మ‌రినట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

సిమిల‌ర్ క‌థ‌లు కావ‌డంతో అనుష్క టీమ్ క‌థ‌లో మార్పులు చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 'స్వాతిముత్యం' క‌థ‌కు ద‌గ్గ‌రి పోలిక‌లు వుండ‌టంతో మేజ‌ర్ పాయింట్ లో మార్పులు మొద‌లు పెట్టార‌ట.

ఇటీవ‌లే ఇదే త‌ర‌హాలో సిమిల‌ర్ క‌థ‌తో రెండు సినిమాలు విడుద‌లై యావ‌రేజ్ టాక్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ముందు నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన 'అంటే సుంద‌రానికి' విడుద‌లై యావ‌రేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ త‌రువాత రీసెంట్ గా నాగ‌శౌర్య హీరోగా రూపొందిన 'కృష్ణ వ్రింద విహారి' కూడా ఇదే త‌ర‌హా పాయింట్ తో తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.